• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అధికారుల్లోఎంత మార్పు?

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Tuesday, May 25 2004

;?

హైదరాబాద్‌:రాజశేఖరరెడ్డి నాయకత్వంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలోఐఎఎస్‌ అధికారుల వైఖరిలో స్పష్టమైన మార్పు కన్పిస్తోంది.గోదావరి పుష్కరాలను దాదాపు రెండు వందల కోట్ల రూపాయలఖర్చుతో స్వయంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మోహన్‌ కందా త్వరలో జరుగనున్న కృష్ణాపుష్కరాలను సింపుల్‌ గా నిర్వహిద్దామని సూచించారు.

ప్రభుత్వవిధానాలను బట్టి సీనియర్‌ ఐఎఎస్‌ అధికారుల మైండ్‌సెట్‌మారుతుందనడానికి ఇది చక్కటి ఉదాహరణ. వ్యవసాయం,గ్రామీణాభివృద్ధి మీద స్పెషలైజేషన్‌ ఉన్న మోహన్‌ కందాచంద్రబాబు నాయుడికి నచ్చని విషయాలనువివరించలేపోయారు. ఫార్ములావన్‌ రేసింగ్‌ అంటే ఆనాడు అద్భుతంగాఅభివర్ణించిన ఆయన ఇప్పుడు అటువంటి ప్రాజెక్టులనుఅంటరానివిగా చూస్తారు.

రౌతుకొద్దీ గుర్రం అంటే ఇదే. చంద్రబాబు నాయుడు నేరుగా ఐఎఎస్‌అధికారులతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల మంత్రుల ప్రాధాన్యంతగ్గిపోయి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం ఏర్పడింది.సామాన్యప్రజలతో ఆయన ప్రభుత్వానికి లింక్‌ తెగిపోవడానికిఇటువంటి వైఖరే కారణం. చంద్రబాబు కీర్తి కండూతిని ఆధారంచేసుకుని కొందరు సీనియర్‌ అధికారులు పవర్‌ పాయింట్‌ప్రెజెంటేషన్ల ద్వారా కొన్ని ప్రాజెక్టుల గురించి చంద్రబాబుకు సినిమాచూపించేవారు. ఫైళ్ళు చకచకా కదిలేవి. అధికారులకుమధ్యవర్తులకు చేతినిండా డబ్బు దొరికేది.

విద్యుత్‌సబ్సిడీలంటే దేశద్రోహం అంతటి పాపమని చంద్రబాబు నాయుడుహయాంలో వాదించిన అధికారులే ఇప్పుడుపేద రైతులకు మరింతవెసులుబాటు కల్పించే పథకాలతో ముందుకొస్తున్నారు.చంద్రబాబు నాయుడి హయాంలో ఐఎఎస్‌ అధికారుల మహర్దశకుమంచి ఉదాహరణ హుడా ఎండి లక్ష్మీపార్ధసారధి. ఆమె దాదాపుఏడేళ్ళుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు.

ముఖ్యమైనపదవుల్లో సీనియర్‌ అధికారులను మూడేళ్ళకు మించికొనసాగించరాదని హైకోర్టు తీర్పు ఉంది. లక్ష్మి హయాంలో హుడాలోఅనేక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. రోడ్ల మధ్యలోపెంచుతున్న గడ్డిలోనే కాంట్రాక్టర్లు దారుణంగాదోచుకున్నారు. అర్బన్‌ ఫార్రెస్టీలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీకావు. కొత్తప్రభుత్వం మొదట పాలన యంత్రాంగాన్ని తన విధానాలకుఅనుగుణంగా సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది.

  • కాంగ్రెస్‌లో ఇది మామూలే!
  • వైఎస్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యి
  • ఎవరు గొప్ప?
  • ఆచితూచి అడుగులు
  • సవాళ్ళు ఎన్నో...
హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X