• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈ ఎర్రర్‌ తో టెర్రర్‌ తగదు

By Staff
|

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Thursday, June 10 2004

హైదరాబాద్‌: బాలకృష్ణ ఇంట్లో కాల్పులకేసుపై దాదాపు వారంరోజుల పాటు సాగిన హైడ్రామాకు ఎత్తుకుపైఎత్తు అని పేరు పెట్టుకోవచ్చు. పోలీసులు ఎన్నడూ ఎరుగనంతఉత్సాహంగా కేసు దర్యాప్తు జరిపి టీవీ ఛానళ్ళ వారికి గంటకొకఫ్లాష్‌ న్యూస్‌ ఇస్తూ వచ్చారు. వారి దర్యాప్తు వేగం హాలీవుడ్‌పోలీసులను తలపింపజేసింది.

ఈ సినిమా కాని సినిమాలో హీరోలు, విలన్లుఎవరన్నది అప్రస్తుతం. పోలీసులు ఉచ్చు బిగిస్తున్న కొలది బాలకృష్ణతరఫున ఉన్న కాకలు దీరిన క్రిమినల్‌ లాయర్లు, కొందరుసినిమా పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

బాలకృష్ణను తెల్లవారు జామునమూడున్నరకు మెజ్రిస్టేట్‌ ఇంటికి పోలీసులు రహస్యంగాతరలిస్తుండగా మీడియా వాహనాలు చేజ్‌ చేసి ఆ దృశ్యాలుచిత్రీకరిస్తున్న సమయంలోనే సీన్‌ కట్‌ చేస్తే అపోలో ఆస్పత్రిలోబాలకృష్ణ తరఫు లాయర్లు, సినిమా ప్రముఖులు బెల్లంకొండతో మంతనాలుజరపడాన్ని డైలాగ్స్‌ విన్పించని సీన్‌.

బాలకృష్ణే కాల్పులు జరిపాడని తమ వద్దశాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని అదనపు పోలీసు కమిషనర్‌ ఎకెఖాన్‌ప్రకటించిన కొన్ని గంటల్లోనే బాలకృష్ణ తన మీద కాల్పులుజరపలేదని బెల్లంకొండ సురేష్‌ సంచలన ప్రకటన చేశాడు. దీనినిఇంటర్వెల్‌ ముందు సీన్‌ అనుకోవచ్చు.

బాలకృష్ణ డ్రైవర్‌ ను అరెస్టు చేసికాల్పులు జరిగిన ఆ రాత్రి జరిగిందేమిటో పోలీసులు రికార్డు చేయడంతోఇంటర్వెల్‌ అనంతర దృశ్యం మొదలయింది. బాలకృష్ణ భార్యనుఅరెస్టు చేయడానికి జూబిలీహిల్స్‌, బంజారాహిల్స్‌లలోని వారిబంధువుల అందరి ఇళ్ళ వద్ద సబ్‌-ఇన్స్పెక్టర్‌ స్ధాయిఅధికారులను మఫ్టీలో కాపలా ఉంచడం క్లయిమాక్స్‌ కు ముందరిసీన్లలో ఒకదానిగా భావించవచ్చు. నిన్నటి వరకు వాచుబతుకుల్లో ఉన్నాడని చెబుతున్న సత్యనారాయణ చౌదరిబాలకృష్ణ గారు నామీద కాల్పులు జరపలేదు, ఎవరోకాల్చారు అని చెప్పడం మరో బలమైన సీన్‌. అదే సమయంలోనిమ్స్‌లో బాలకృష్ణను ఆయన సోదరి, కాంగ్రెస్‌ ఎంపిపురంధరేశ్వరి సందర్శించారు. మరో గంటలో బాలకృష్ణ బెయిల్‌మీద మెజ్రిస్టేట్‌ నిర్ణయం ప్రకటిస్తారనగా ఈ సీన్ల పరంపరసాగింది.

ఎన్నాళ్ళుగానో బాలకృష్ణపై జరుగుతున్నకుట్ర కాల్పుల రోజు బయటపడిందని, మంచి మిత్రులైన బాలకృష్ణబెల్లకొండ, సత్యనారాయణ చౌదరి మళ్ళీ చేత్లు కలపడంతోసినిమా సుఖాంతం కావాలని తమ హీరో పుట్టినరోజు సందర్భంగాఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

ఇటీవలికథనాలు

 • చుట్టాలు-చట్టాలు
 • ఈయన సినిమా పోలీసు కాదు
 • ప్రత్యూష కేసు మరో మలుపు
 • ప్రజల దేవుడు
 • విశ్లేషణ..సగటు ఓటరు విజయం
 • రేపటి సంగతి
 • ఎక్కడైనా హీరోలు కానీ...
 • బాబుచేయనిది, కృష్ణ చేసింది...
 • వ్యతిరేక గాలి
 • ఎక్కడైనా హీరోలు కానీ...
 • బాబుచేయనిది, కృష్ణ చేసింది...
 • చంద్రబాబుతురుపుముక్క
 • ఎన్టీఆర్‌ గుర్తున్నాడా?
 • సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
 • చిరంజీవిరహస్య ఎజెండా?

 • అస్పష్ట రాజకీయ చిత్రం
 • హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X