శ్రీనివాస్‌కు జైపాల్ కనుసైగ
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
కాంగ్రెస్ Friday, May 07 2004
హైదరాబాద్: మెజారిటీ స్ధానాలు తమకేవస్తాయని నమ్ముతున్న కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రిఅభ్యర్ధి విషయంలో స్పష్టతరాలేదు. మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మేల్యేల మద్దతు వైఎస్‌కేఉంటుందన్న విషయంలో సందేహం లేకపోయినా కొన్ని విచిత్ర పరిణామాలు డి.శ్రీనివాస్‌కు అనుకూలంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్ధివిషయంలో సోనియాగాంధీ మనసులో ఏముందో ఎవరూపసిగట్టలేకపోతున్నారు. ఆమె ఎన్నికల ప్రచారంలో బిజీగాఉన్నారు. సిఎం విషయంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాం నబీఆజాద్, కాంగ్రెస్ ఆధికార ప్రతినిధి జైపాల్‌రెడ్డి శుక్రవారంచర్చించినట్టు తెలుస్తోంది. జైపాల్‌రెడ్డి అనేక కారణాల వల్లశ్రీనివాస్ వైపు మొగ్గుచూపడం నేటి ముఖ్యపరిణామం. గెలిచేఅవకాశాలున్న ఎమ్మెల్యేలను కూడగట్టుకుని బలంపెంచుకోవలసిందిగా జైపాల్ శ్రీనివాస్ కు సూచించినట్టు తెలిసింది.
- బరిలో ధర్మపురి!
- వైఎస్‌కుసమాంతరం












Click it and Unblock the Notifications
