జయలలితస్మార్ట్ గేమ్
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే;/SPAN>
జనరల్ Wednesday, November 17 2004
చెన్నై: కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిఅరెస్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ద్వారాతమిళనాడు ముఖ్యమంత్రి జయలలితబిజెపి సహా ఎన్డీయేను వ్యతిరేకించే పార్టీలకూటమితో చెలిమికి సిగ్నల్‌పంపినట్టయింది. గత ఎన్నికల్లో బిజెపితోపొత్తు వల్ల ఎఐడిఎంకె దారుణంగా నష్టపోయిందన్నఅభిప్రాయంతో ఉన్నజయలలిత ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోడానికిమంచి అవకాశం కోసం ఎదురుచూస్తుండగాఆమె కంచి స్వామి దొరికిపోయారు.
కంచి స్వామికి పరమభక్తురాలైన జయలలిత తనరాజకీయ భవిష్యత్తు కోసం స్వామిభక్తినివదులుకోవడానికి సిద్ధపడ్డారు. డిఎంకెఅధినేత కరుణానిధికి అత్యంత సన్నిహితుడైన సుర్జీత్ సింగ్ బర్నాలాతమిళనాడు గవర్నరుగావచ్చినప్పటినుంచి ఆమెలో రాజకీయఅభద్రతా భావం బాగా పెరిగింది.
శంకరరామన్‌హత్య కేసులో కంచిస్వామి హస్తం ఉందనినక్కీరన్ పత్రిక ప్రచురించినపరిశోధనాత్మక కథనాలుతమిళనాడులో సంచలనం సృష్టించాయి.ఈ కేసును జయలలిత నీరుగారుస్తారని బ్రాహ్మణేతర తమిళ ప్రజలుభావించారు.జయలలిత కంచి స్వామిని రక్షించేప్రయత్నం చేస్తే బ్రాహ్మణేతరతమిళ ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టిఆమెను రాజకీయంగా సమాధి చేయడానికికరుణానిధి స్క్రిప్టు సిద్ధం చేసుకున్నారు. ఈ నేపధ్యంలోతన మనుగడ కోసం కంచి స్వామివిషయంలో జయలలిత పోలీసులకు సంపూర్ణస్వేచ్ఛ ఇచ్చారు.
శంకరరామన్‌హత్య కేసులో కంచి స్వామి హస్తంఉందనడానికి దిగ్భ్రాంతికరమైనసాక్ష్యాలను పోలీసులు తనకు చూపించారని, ఈనెల తొమ్మిదిన మాత్రమేతనకు వాస్తవాలు తెలిశాయని, అసెంబ్లీలోఅన్ని విషయాలు వివరించవచ్చని, తానుఇప్పటివరకు మౌనం వహించాననిజయ అసెంబ్లీలో చెప్పారు. కంచి మఠాన్నిస్వాధీనం చేసుకునే ఉద్దేశం తమప్రభుత్వానికి లేదని, అదంతా దుష్ప్రచారమనిఆమె అన్నారు. చట్టం ముందు అందరూసమానమని తమప్రభుత్వం నిరూపించందని ఆమెచెప్పుకున్నారు.
జాతీయ స్ధాయిలోతృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు చంద్రబాబులోపాయికారీ ప్రయత్నాలు చేస్తున్నతరుణంలో ఆయనకు సన్నిహితురాలైన జయలలితఎన్డీయేకు దూరం కావడం ముఖ్యమైనపరిణామం.
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్ సినిమా
అడవుల విస్తరణలో రాష్ట్రం టాప్
దసరా మూవీస్
రెండో రౌండు సాధ్యమే!
కెసిఆర్ మీమాంస
లంచగొండితనం సమస్య కాదా?
నానితో ఎన్టీఆర్ కటీఫ్
ఇకనైనా నిదానం నాగేందర్












Click it and Unblock the Notifications
