మరోనెల నోటికి చెర!


హైదరాబాద్: టిఆర్‌ఎస్‌అధ్యక్షుడు, కేంద్రమంత్రి చంద్రశేఖరరావు దుందుడుకుధోరణి ప్రత్యేక తెలంగాణను కోరుకుంటున్న సామాన్యులకువిసుగు తెప్పిస్తున్నది. త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయకపోతే సోనియా గాంధీని రోడ్డుకు ఈడుస్తానని ఆయన ప్రకటించడానికినిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలుచేస్తోంది.
తెలంగాణ కు అన్నీ మంచి శకునములే అనుకుంటున్నదశలో చంద్రశేఖరరావు అకారణంగా అనాలోచిత దుండుడుకువైఖరి ప్రదర్శించడం ప్రత్యేక తెలంగాణ మేధావులకు ఆగ్రహంకలిగించింది. ఒక రాష్ట్రం సాధించుకోవాలంటే రాజకీయ పరిపక్వత, గొప్పనాయకత్వ లక్షణాలు అవసరమని, బజారు మాటలు మాట్లాడుతున్నచంద్రశేఖరరావుతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుసాధ్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆయన ఒక పథకం ప్రకారమేసోనియాపై మాటల దాడి చేసి ఉంటారని మొదటిరోజు భావించిన తెలంగాణమేధావులు మరునాడే కెసిఆర్ క్షమాపణ చెప్పే ధోరణిలోమాట్లాడడంతో నిరాశ చెందారు.చంద్రశేఖరరావుకు రెచ్చగొట్టడం వచ్చు గానీ తెలంగాణతెచ్చిపెట్టడం రాదని ఆయన ప్రత్యర్ధి ఒకరు విమర్శించారు. పైకి ఇలామాట్లాడినా చంద్రశేఖరరావు కాంగ్రెస్‌తో పొత్తు వదులుకోరని,ఆయనది అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్న ధోరణి అని వారువిశ్లేషిస్తున్నారు.
చంద్రశేఖరరావు బియ్యంకడిగి పొయ్యి మీద పెడతారు. కింద మంటపెడతారు. అన్నంఉడకకముందే అక్కడి నుంచి వెళ్ళి పోతారు అని ఎన్నికల ముందుఆయన గ్రామానికి చెందిన ఒక వృద్ధుడు చంద్రశేఖరరావుమనస్తత్వం గురించి ఒక పత్రికకు చక్కగా చెప్పారు.
ఎన్నికల సమయంలోచంద్రశేఖరరావుపై టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలువచ్చాయి. ఆయన ధోరణితో విసిగిపోయి బయటకు వచ్చిన నాయకులుఆయన వ్యక్తిత్వం గురించి రకరకాలుగా బహిరంగ ప్రకటనలుచేశారు. చంద్రశేఖరరావు వాటిని దులిపేసుకున్నట్టువ్యవహరించారు. ఎమ్మెల్యే కూడా కాని ఆయన మేనల్లుడికిఏకంగా రాష్ట్రంలో కేబినేట్ మంత్రి పదవి ఇప్పించుకున్నారు. ఇదికూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆయన మీద కోర్టులో చీటింగ్ కేసుపెండింగ్‌లొ ఉంది. సోనియా గాంధీ తెలంగాణ ప్రజల దేవత అనిప్రకటించిన ఆయన ఆమెను బజారు కీడుస్తానని ప్రకటించడం,తెలంగాణ అర్ధంలో బజారు కీడ్చడం అంటే పంచాయితీ పెట్టడమనిసమర్ధించుకోవడం అనేక అపార్ధాలకు దారితీసింది.
చంద్రశేఖరరావు విషయంలో పిసిసిఅధ్యక్షుడు డి.శ్రీనివాస్ మంచి వ్యాఖ్య చేశారు. సోనియాగాంధీ ఆయనతెలంగా విషయంలో హామీ ఇస్తే ఇచ్చి ఉండవచ్చని, అంతటి పెద్ద వారితోఆంతరింగకంగా చేసిన చర్చను గోప్యంగా ఉంచడం రాజకీయపరిపక్వత అనిపించుకుంటుంది గానీ వాటిని అనవసరంగా బహిర్గతపరచడం మంచిది కాదని శ్రీనివాస్ అన్నారు. అది బ్రీచ్ ఆఫ్‌కాన్ఫిడెన్స్ కిందికి వస్తుందని ఆయన అన్నారు.
ఇప్పుడున్న పరిస్ధితుల్లోచంద్రశేఖరరావు కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకునేఅవకాశం లేదు. ఆయన ఈ అంశం మీద మరో నెలరోజుల వరకుమాట్లాడాలానుకోవడం లేదని టిఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కెసిఆర్ సోనియాగాంధీ మీద నోరుపారేసుకోవడం సమంజసమేనా?
మీ అభిప్రాయాలు పంపితే పేరుతో సహాప్రచురిస్తాం.
తెలంగాణపై రిలే డిలే తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!
మంచి సినిమా గతి ఇంతేనా?
మేటిప్లేయర్ ద్రావిడ్
టాప్‌స్లాట్‌పై కైఫ్ కన్ను
పారితోషికాలుతగ్గింపు?
వేడెక్కిన సిద్ధిపేట
గాంధీజీ చివరి అడుగులు
పనివాళ్ళ పనికాదు
పులిరాజాఏమయ్యాడు?
చిత్ర హింస
కెసిఆర్‌ఏం చేస్తున్నట్లు?
రాజకీయరంగులు
చంద్రబాబుశైలి బాట
పరిటాలకథ హోంపేజి