సినిమావాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
హైదరాబాద్:చంద్రబాబు నాయుడు హయాంలోఅత్యధిక ప్రాధాన్యం పొందిన సినిమాప్రముఖులను, మీడియాను వైఎస్‌రాజశేఖరరెడ్డి చాలా దూరంగాఉంచుతున్నారు. ఆరునెలల క్రితం సినిమా ప్రముఖులు టిడిపి ప్రభుత్వాన్నితామే నడిపిస్తున్నామన్న ఫీలింగ్‌లోఉండేవారు. చంద్రబాబు నాయుడు కూడాఇంటి వద్ద గానీ పార్టీ ఆఫీసులో గానీ సచివాలయంలో గానీసినిమా ప్రముఖులను అపాయింట్ మెంట్ లేకపోయినాకలుసుకునే వారు.
వారు రాజకీయాలగురించి చెప్పే సినిమా కథలను ఆసక్తిగావినేవారు. ఇప్పుడు వైఎస్ అపాయింట్‌మెంట్‌లేనిదే ఎంతటి సినిమాప్రముఖులనైనా కలవడం లేదు. గతఎన్నికల్లో సినిమా వాళ్లంతా కట్టకట్టుకునిఒక ఉద్యమంగా కాంగ్రెస్‌కువ్యతిరేకంగా తెలుగుదేశం కుఅనుకూలంగా ప్రచారం చేశారు. ఆఖరుకుటీవీ ఆర్టిస్టులను కూడా చంద్రబాబువిడిచిపెట్టలేదు. అయినా వారు ప్రజలనుప్రభావితం చేయలేకపోవడంతోవైఎస్ వారిని దూరంగా ఉంచడమే మంచిదన్న గట్టినిర్ణయానికి వచ్చారు.
చంద్రబాబునాయుడు మీడియాకు చెందిన కొందరిని నెత్తిమీద పెట్టుకునేవారు.వారిని మేధావులుగా భావించి వారి సలహాలను డైరీలోరాసుకునేవారు. పనిలో వారు అడిగినపనులు చేసి వారు ఆర్ధికంగా బలపడేలాగా చూసేవారు. ఇప్పుడు వైఎస్‌మీడియాతోఅంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.ప్రెస్ అకాడమీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నకొందరు సీనియర్ జర్నలిస్టులు అపాయింట్‌మెంట్‌తీసుకుని ఆయనను కలుస్తున్నా ఆయన నవ్వుతూచూద్దాం అంటున్నారే కానీ కమిట్‌కావడం లేదు. ప్రెస్ అకాడమీ అధ్యక్షపదవిలో ఇప్పటికీ చంద్రబాబు నాయుడుమనిషి కొనసాగడంపై కాంగ్రెస్‌సానుభూతిపరులైన జర్నలిస్టులుఆగ్రహంగా ఉన్నారు.
మూడో ఫ్రంట్‌కు బాబు చొరవ?
చింత చచ్చినా పులుపు చావలేదు..
చంద్రబాబు యూరప్ యాత్ర
తెలంగాణకు ఎర్ర జెండా
ఆరుదేశాల్లో ఎన్నారై శాఖ ఆఫీసులు
మొగిలిచెర్లలో వార్
సిద్దిపేట సీను
ఆంధ్రపై జయ చిందులు
మణికుమారికి సవతిపోరు!
కొడుకు రాజకీయంపై వైయస్
సైకిల్ దిగిన బాబూఖాన్
సమైక్య నినాదం ఊపు
తిరగబడిన రాత
బాబుపై బాలయ్య అసంతృప్తి!
సచిన్ టెండూల్కర్ - ఇంటర్వ్యూ












Click it and Unblock the Notifications
