అక్రమాల ల్యాండ్‌మార్క్
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు హయాంలో విచ్చలవిడిగా ప్రభుత్వ భూముల పందేరం జరిగిందని, అధికారంలోకి రాగానే దీని మీద విచారణ జరిపిస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడెందుకో ఈ విషయం గురించి మాట్లాడడం లేదు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్ర్‌స్టక్షన్ అనే ఒక అనుమానాస్పద సంస్ధకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హైటెక్ సిటీ దగ్గర యాభై ఎకరాలకు పైగా స్ధలాన్ని నామమాత్రపు రేటుకు లీజుకిచ్చింది. ఎకరం రెండు మూడు కోట్ల విలువ చేసే స్ధలాన్ని ఈ సంస్ధకు అతి తక్కువ ధరకు ఎందుకు ధారాదత్తం చేయవలసి వచ్చిందో, ఈ సంస్ధ డైరెక్టర్ల బోర్డులో ఎవరెవరి మనుషులు ఉన్నారో, రాష్ట్ర అభివృద్ధికి సంస్ధ కంట్రిబ్యూషన్ ఏమిటో విచారణ జరిపించి ప్రజలకు నిజానిజాలు తెలియజేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది.
ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈవిధంగా కొన్ని వేల ఎకరాలను టిడిపి ప్రభుత్వం వివిధ ప్రైవేటు సంస్ధలకు కేటాయించింది. వీటన్నిటి మీద కలిపి విచారణ జరిపించాలి. పార్టీలు వేరైనా పాలకులంతా ఒకటేనన్న అభిప్రాయం, అనుమానం ప్రజల్లో లేకపోలేదు. రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా టిడిపి కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండేసి సార్లు మారాయి. అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులపై విచారణ జరిపించి వారికి శిక్షపడేలా చూస్తానని తొంభై నాలుగో సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన ఎన్టీ రామారావు ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత ఏ కాంగ్రెస్ నాయకుడి అవినీతి మీద విచారణ జరిపించలేదు.
అప్పటికంటే ఇప్పుడు ప్రజాజీవితంలో పారదర్శకత పెరిగింది. మరింత పారదర్శకతను, అక్రమాల వెలికితీతను ప్రజలు సహజంగా కోరుకుంటారు.చంద్రబాబు నాయుడికి ప్రత్యక్ష ప్రమేయం ఉందన్న ఆరోపణలు గల కుంభకోణాల జోలికి పోకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏలేరు వంటి కుంభకోణాలను తిరగదోడడం పెద్ద కుంభకోణాలను మరుగున పరచడానికేనన్న అభిప్రాయాన్ని వామపక్ష నాయకులు జనాంతికంగా వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడులో అయితే గత ప్రభుత్వాల నిర్వాకాల మీద విచారణలు, న్యాయపోరాటాలు తీవ్రంగా జరుగుతాయి. అయితే ఆ రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపులు ఎక్కువ. కక్షసాధింపు ధోరణిలో కాకుండా ప్రజా ప్రయోజనాల రీత్యా గత ప్రభుత్వాల అక్రమాలను వెలికి తీయించి బాధ్యులకు శిక్షపడేలా చేస్తే రాజకీయ నాయకులు ముందు ముందు వళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు.
చంద్రబాబు నాయుడు హయాంలో ప్రపంచబ్యాంకు నుంచి తెచ్చిన సుమారు యాభై వేల కోట్ల రూపాయలు ఏఏ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టారు? ఆ నిధులు ఏస్ధాయిలో దుర్వినియోగమయ్యాయి అనే విషయంపై శ్వేతపత్రం సమర్పిస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ నాయకులు ఇంకా మౌనం పాటిస్తున్నారు. ఇటువంటి సమాచారం ప్రజల ముందు ఉంచడానికి వీలుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టాన్ని తెస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన రాజశేఖరరెడ్డి ఈ విషయంపై తక్షణం దృష్టి సారించవలసిన అవసరం ఉంది. క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌పై ప్రజల్లో ఎంత ఏవగింపు కలిగిందో రాజకీయాల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌ను కూడా అంత తీవ్రంగా పరిగణించాలి.
ఇటీవలికథనాలు
- రియల్(ఎస్టేట్) రిపోర్ట్
- వెలుగు వెనుక చీకటి
- ఈ సినిమా పేరు ఎత్తుకు పైఎత్తు
- చుట్టాలు-చట్టాలు
- ఈయన సినిమా పోలీసు కాదు
- ప్రత్యూష కేసు మరో మలుపు
- ప్రజల దేవుడు
- విశ్లేషణ..సగటు ఓటరు విజయం
- రేపటి సంగతి
- ఎక్కడైనా హీరోలు కానీ...
- బాబుచేయనిది, కృష్ణ చేసింది...
- వ్యతిరేక గాలి
- ఎక్కడైనా హీరోలు కానీ...
- బాబుచేయనిది, కృష్ణ చేసింది...
- చంద్రబాబుతురుపుముక్క
- ఎన్టీఆర్ గుర్తున్నాడా?
- సైకిల్‌కుఅసమ్మతి బ్రేక్‌లు
- చిరంజీవిరహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం












Click it and Unblock the Notifications