గంగూలీ సందడి

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Saturday, July 03 2004

Gangulyహైదరాబాద్‌: రాష్ట్రంలోకి ప్రైవేటుపెట్టుబడులను ఆకర్షించడానికి మన క్రికెట్‌ జట్టు కెప్టెన్‌సౌరవ్‌ గంగూలీని బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టుకోవాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. విదేశీ పెట్టుబడుల సలహాదారు సిసి రెడ్డికివస్తున్న వైల్డ్‌ ఐడియాలలో ఇదొకటి. రాష్ట్రంలోని చెరకురైతులకు ఆఫ్రికా దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తానని,విదేశాలకు అవసరమైన ఐటి నిపుణులే కాదు రైతులు కూడామన రాష్ట్రంలో ఉన్నారని ఆయన పదవి చేపట్టినరోజేప్రకటించారు.

శతకోటి దరిద్రాలకు అనంతకోటిఉపాయాలని సామెత. యాన్‌ ఐడియా కెన్‌ చేంజ్‌ యువర్‌లైఫ్‌ అనేది ఆధునిక కార్పొరేట్‌ మంత్రం. ఉన్న వ్యవస్ధనుఉన్నట్టు నడపడం కంటే మెరుగైన సమాజం కోసం కొత్తఆలోచనలను ఆచరణలో పెట్టడం అవసరమే.

అయితే భారీగా డబ్బు ముట్టజెప్పనిదేఅంబాసిడర్‌గా ఉండడానికి గంగూలీ అంగీకరించడన్న విషయంతెలిసిందే. మూడు ప్రైవేటు బ్యాంకులు ఐసిఐసిఐ, ఐఎన్‌జివైశ్య, ఇండస్‌లు గంగూలీని బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టుకోడానికిపోటీ పడుతున్నాయి. గంగూలీ ఏటా కోటి నుంచి రెండు కోట్లరూపాయల పారితోషికం అడిగే అవకాశం ఉందనిఅడ్వర్టయిజ్‌మెంట్‌ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

గంగూలీ రాష్ట్ర ప్రభుత్వ అంబాసిడర్‌గాఉండడాని అడ్డుపడే అంశాలు:

  • గంగూలీకి అంత పారితోషికం ఇస్తే ప్రజల నుంచిప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయి.

  • గంగూలీ అంబాసిడర్‌గా ఉండడం వల్లప్రైవేటు పెట్టుబడులు వస్తాయని నమ్మకంగా చెప్పలేం.పెట్టుబడులు రావడానికి మౌలిక సదుపాయాలు ముఖ్యం కానీబ్రాండ్‌ అంబాసిడర్లు కాదు

  • పశ్చిమ బెంగాల్‌కు చెందిన గంగూలీపరాయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని పారిశ్రామిక వేత్తలకుపిలుపు ఇవ్వడం అతని సొంతరాష్ట్ర ప్రజలకు బాధ కలిగిస్తుంది.

    ఎందుకంటే ప్రాజెక్టులను చేజిక్కించుకునే విషయంలో రాష్ట్రాలమధ్య పోటీ ఉంటుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆఫర్‌నుఅతను అంగీకరించకపోవచ్చు. సిసి రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంకామెరుగైన సలహాలు ఇస్తే బాగుంటుంది.

    • ఇన్‌సైడర్‌కుఎనబై నాలుగు
    • మనోహర్‌ఎందుకు దొరకడు?
    • దివ్యహత్య వెనుక..
    • చంద్రబాబుఅస్త్రాలు
    • ఎవరీ సిసి రెడ్డి?
    • అక్రమాల ల్యాండ్‌మార్క్‌
    • రియల్‌(ఎస్టేట్‌) రిపోర్ట్‌
    • వెలుగు వెనుక చీకటి
    హోంపేజి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+