వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యనినాదం ఊపు

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే జనరల్‌ Wednesday, July 14 2004

హైదరాబాద్‌:సమైక్యాంధ్ర నినాదంతో ఉద్యమాలుఊపందుకుంటున్న సూచనలుకనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంఏర్పాటుకు పార్లమెంటు శీతాకాలంసమావేశాల్లో బిల్లు ప్రతిపాదిస్తున్నట్లుతెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)నాయకుడు, కేంద్ర మంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటనలుచేస్నున్న నేపథ్యంలో ఈ ఉద్యమాలుఇప్పుడిప్పుడే పుడుతూఊపందుకునేందుకు ప్రయత్నాలుచేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌నగర శివార్లలో సమైక్యాంధ్రపరిరక్షణ సమితి తనకార్యక్రమాలను సాగిస్తోంది.ప్రదర్శనలు నిర్వహిస్తూ, కెసి ఆర్‌దిష్టిబొమ్మలను తగులబెడుతూసమైక్యాంధ్ర నినాదాన్ని వినిపిస్తోంది.అయితే ఇది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపునాదిగా పుట్టిందనే విమర్శలువినిపిస్తున్నాయి.

ఇదిలావుంటే,తాజాగా తెలుగుజాతి ఐక్య పోరాట వేదికఇటీవల విజయవాడలో ఆవిర్భవించింది. జూన్‌ఇరవే యేడవ తేదీన ఈ వేదికపుట్టింది. తెలుగుజాతిని ముక్కలుచేయడానికి కొందరు రాజకీయనాయకులు పూనుకోవడాన్ని ఈ వేదికనిరసించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకుప్రజల మద్దతు లేదని కూడా స్పష్టంచేసింది. సమతా పార్టీ మాజీజాతీయాధ్యక్షుడు వి.వి. కృష్ణారావు,తెలుగు భాషోద్యమ సమాఖ్య ప్రధానకార్యదర్శి, నడుస్తున్న చరిత్రపత్రిక సంపాదకుడు డాక్టర్‌ సామలరమేష్‌ బాబు, చరిత్రకారుడుపోలవరపు కోటేశ్వరరావు ఈవేదికకు సమన్వయ కర్తలుగావుంటారు. విజయవాడలో జరిగినసదస్సులో ఈ ముగ్గురితో పాటు ప్రముఖ కవినగ్నముని, లవణం, వి. ఆర్‌.బొమ్మారెడ్డి వంటి ప్రముఖులుపాల్గొన్నారు. సమైక్యాంధ్రకుఅనుకూలంగా సదస్సు మూడు తీర్మానాలుచేసింది.

సమైక్యాంధ్రపరిరక్షణకే కాకుండా తెలుగుమాట్లాడే ప్రజలున్న ఇతర ప్రాంతాలనుకూడా కలుపుకొని ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రాన్ని పునర్వ్యస్థీకరించాలని ఈవేదిక డిమాండ్‌ చేస్తోంది. అందుకుఉద్యమించాలని కూడా నిర్ణయించింది. ఈ వార్తలవిశేషాలతో పాటు లవణం, నగ్నముని,తదితరుల సమైక్యాంధ్రాకాంక్షవ్యాసాలతో నడుస్తున్న చరిత్ర జులైసంచిక వెలువడింది.

ఈవేదిక రెండో సదస్సును ఖమ్మం జిల్లాలోనిపాల్వంచలో నిర్వహించాలని తలపెట్టారు. ఈప్రయత్నం అటుండగా ప్రత్యేకరాయలసీమ ఉద్యమం కూడాఊపందుకుంటున్నది. రాయలసీమహక్కుల సాధన కమిటీ, రాయలసీమఐక్య వేదిక తమ కార్యకలాపాలనుముమ్మరం చేశాయి. తెలంగాణరాష్ట్రం ఏర్పడితే రాయలసీమనుప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయాల్సిందేనని రాయలసీమవేదికలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈఉద్యమాలు ఎక్కడి దాకా పోతాయో వేచిచూడాల్సిందే.

Recent Stories
తిరగబడినరాత
బాబుపైబాలయ్య అసంతృప్తి!
సచిన్‌టెండూల్కర్‌ - ఇంటర్వ్యూ హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X