చంద్రబాబుశైలి బాట
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
కాంగ్రెస్ Monday, August 23 2004
హైదరాబాద్:చంద్రబాబు నాయుడు విధానాలను తీవ్రంగావ్యతిరేకించే ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిఆయన శైలిని మాత్రం అనుకరిస్తున్నట్టుకన్పిస్తున్నది. రాజీవ్‌పల్లెబాట కార్యక్రమంజన్మభూమి లాంటిదే. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీకిచంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రాధాన్యాన్ని రాజశేఖరరెడ్డికొనసాగిస్తున్నారు.
గుంటూరుజిల్లా చిలువూరు గ్రామంలో వైఎస్ ఇటీవల ఆయనరాజీవ్ ఐటీ విలేజిని వీడియో కాన్ఫరెన్సుద్వారా ప్రారంభించారు. ఆయన నిర్వహించినతొలి వీడియో కాన్ఫరెన్సు ఇదే. చంద్రబాబునాయుడి వీడియో కాన్ఫరెన్సులను ప్రతిపక్షంలోఉండగా వైఎస్ తీవ్రంగా విమర్శించారు.
మంత్రులనుఅదుపులో ఉంచే విషయంలో కూడా వైఎస్ చంద్రబాబునాయుడిని ఆదర్శంగా తీసుకున్నట్టు కన్పిస్తోంది.ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోఆయన మంత్రులకు హెచ్చరిక జారీచేశారు.మీరు ఏమేం చేసుకుంటున్నారో నావద్ద నివేదికలు ఉన్నాయి అని చెప్పడంద్వారా మంత్రులను అదుపులో ఉంచుకునేప్రక్రియ మొదలు పెట్టారు. పైకి నిరంకుశంగాకన్పించకపోయినా కొన్ని విషయాల్లో ముఖ్యమంత్రిమొండిగా వ్యవహరిస్తున్నారు.
మీడియామేనేజ్‌మెంట్ విషయంలో మాత్రం వైఎస్‌చంద్రబాబు నాయుడిని అనుకరించడంలేదు. చంద్రబాబు నాయుడు మీడియా అత్యధికప్రాధాన్యం ఇచ్చేవారు. వైఎస్ మాత్రం మీడియానులైట్‌గా తీసుకుంటున్నారు. చంద్రబాబునాయుడితో సన్నిహితంగా మెలిగిన సీనియర్‌రిపోర్టర్లను ఆయన దూరంగా ఉంచుతున్నారు.
Recent Stories
పరిటాలకథ
సోనియా: మూడోపవర్‌ఫుల్ లేడీ
టికెట్-క్యాన్సిల్-ఒకతెలుగమ్మాయి
బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్‌ఎస్‌లో ముసలం?
వార్ బహుముఖ విస్తరణ హోంపేజి












Click it and Unblock the Notifications