అమరావతికిఅంతర్జాతీయ శోభ

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 15-12-2005

హైదరాబాద్‌:ప్రపంచ బౌద్ధ గురువు దలైలామాగుంటూరు జిల్లా అమరావతిలో జనవరి 2నకాలచక్ర మహాసభలను ప్రారంభించనున్నారు.ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉన్న బౌద్ధమతస్తులకు ఈ కాలచక్ర మహాసభలుఅత్యంత ముఖ్యమైనవి. అమరావతి నుంచి కృష్ణానది ఎగువన అలంపురంవరకు బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. రెండువేల ఐదు వందల ఏళ్ళ క్రితం కృష్ణా నదిపొడవునా ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధ మతం విలసిల్లింది.బుద్ధ భగవానుడు స్వయంగా అమరావతి సందర్శించి ఇక్కడకాలచక్ర ఉపన్యాసాలు ఇచ్చినందువల్ల ఈసారిఇక్కడ కాల చక్ర మహాసభలు నిర్వహిస్తున్నట్టుదలైలామాప్రకటించారు. ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు రెండు లక్షలమంది బౌద్ధభిక్షువులు ఈ మహాసభలకు వస్తున్నందువల్ల ఏర్పాట్లకు రాష్ట్రప్రభుత్వం 50 కోట్ల రూపాయలు కేటాయించింది.

మనదేశంలోతొలినాళ్ళలోనే బౌద్ధ మతం విస్తరించినాకాల చక్ర మహాసభలో దేశంలోజరగడం ఇదే ప్రధమం. ఇప్పటివరకు వివిధ దేశాల్లో 29 సార్లు ఈమహాసభలు జరిగాయి. అమరావతిలో 30వమహాసభలు జరుగనున్నాయి. జనవరిరెండు నుంచి 16వ తేదీ వరకుజరుగునున్న ఈ మహాసభల నిర్వహణశుభసూచకమని భావించిన స్ధానికరైతులు తాత్కాలికంగా తమ పొలాలనుకలెక్టరుకు అప్పగించడానికి ముందుకువచ్చారు. ఈ విధంగాసేకరించిన 180 ఎకరాల్లో బౌద్ధ భిక్షువులవసతి కోసం గుడారాలను నిర్మిస్తున్నారు.కాలచక్ర మహాసభల సందర్భంగాఅమరావతిలో దక్షిణాసియాలోనేఅతిపెద్దదైన ధ్యాన బుద్ధ విగ్రహం (120అడుగులు) ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహంకోసం 50 లక్షల రూపాయలు కేటాయించారు.రెండు నెలల పాటు ఇక్కడ ఉండడానికి బౌద్ధభిక్షువులు ఇప్పటికే అమరావతికిచేరుకున్నారు. పెద్ద గ్రామమైనఅమరావతిలో ఈ కారణంగా ఇంటి అద్దెలుఅనేక రెట్లు పెరిగాయి.

అమరావతిలో ఉన్నబౌద్ధ స్ధూపానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యముంది.బుద్ధ భగవానుడుతొలి ధర్మోపదేశాన్ని ఇక్కడే ఇచ్చారనిఅమరావతి చరిత్ర చెబుతోంది.ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగాఇక్కడి బౌద్ధ స్ధూపం శిధిలావస్ధలో ఉంది.మేకలు గొర్రెలు విశాలమైన స్ధాపం మీదికిఎక్కి మేత మేస్తుంటాయి. రాష్ట్రంలో 144 బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయని, వాటిలో 44ముఖ్యమైనవని వాటిని పర్యాటకకేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి గీతారెడ్డి చెప్పారు.

ఇటీవలి కథనాలు హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+