వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీన్‌ మారుతున్నసినిమా రంగం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 10-08-2005

హైదరాబాద్‌:2005 సంవత్సరంలో జనవరి నుంచి నేటివరకు తెలుగులో పెద్ద హీరోల సినిమాలు పెద్దగా ఆడకపోవడంపైపరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. తమిళ రీమేక్‌వెంకటేష్‌ సంక్రాంతి, రవితేజభద్ర తప్ప ఇంతవరకు పెద్దహీరోల సినిమాలు హిట్‌ కాలేదు.తమిళం నుంచి అనువదించినచంద్రముఖి, అపరిచితుడు హిట్‌అయ్యాయి. తెలుగులో పెద్ద హీరోల సినిమాలుఆడకపోవడం వల్ల చిన్న బడ్జెట్‌ చిత్రాలసంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.అనుకోకుండా ఒకరోజు, ఎ ఫిల్మ్‌ బైఅరవింద్‌ వంటి మీడియం బడ్జెట్‌ సినిమాలునిదానంగా హిట్‌ అయ్యాయి. పెద్దహీరోల సినిమాలు అనగానే బయ్యర్లువేలం వెర్రిగా ఎగబడే రోజులు పోయినట్టే కనిపిస్తోంది.

తెలుగుసినిమా మార్కెట్‌ రేంజిని మించి బడ్జెట్‌పెరిగిపోవడం పెద్ద సమస్యగా మారింది. భారీ సెట్స్‌,భారీ పారితోషికాలు, విదేశీ షెడ్యూళ్ళ వల్ల సినిమా నిర్మాణవ్యయంతడిసి మోపెడవుతోంది. అధిక ధరలుచెల్లించడానికి బయ్యర్లువెనుకాడడంతో సినిమాలు డెఫిసిట్‌లోవిడుదల అవుతున్నాయి. అత్యధిక ప్రచారం జరిగిన సూపర్‌ ఫ్లాప్‌కావడం పెద్ద హీరోల సినిమాలకు పెద్దదెబ్బగా మారింది. మహేష్‌బాబు అతడుకూడా యావరేజిగా ఉండడం పరిస్ధితినిమరింత దిగజార్చింది. వీటన్నిటి ప్రభావం జూనియర్‌ఎన్టీఆర్‌ మీద పడినట్టు కనిపిస్తోంది. ఆయన తదుపరిచిత్రమేమిటో ఎవరూచెప్పలేకపోతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌ల చిత్రాలనుకూడా బయ్యర్లు గ్యారంటీ అనుకునేపరిస్ధితి లేదు.

దేశంలోహిందీ తర్వాత అతి పెద్దదైనతెలుగు సినిమా పరిశ్రమ మహాయుగం నుంచి మసాలా శకంలోకి వచ్చింది.సినిమాల్లో సాంకేతిక విలువలు పెరగడంఒక మంచి పరిణామం. కథ, కథనంవిషయంలో ఇప్పటికీ మన దర్శకనిర్మాతలు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఎంఎస్‌ రాజు వంటికొద్ది మందినిర్మాతలు సినిమా వ్యాపారంలోనిమెళకువలను నేర్చుకున్నారు.హీరోలు, దర్శకులు పారితోషికాలుతగ్గించుకోవాలని నిర్మాతల మండలి ఎప్పటినుంచో పరోక్షంగా సూచిస్తూ వస్తోంది.కొత్తనీటికి అవకాశాలు బాగా రావడంమంచి పరిణామమే అయినా కొత్త నటులు,టెక్నీషియన్లు నిలదొక్కుకోడాని అదనపు శ్రమచేస్తున్నట్టు కన్పించదు.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X