మార్క్సిస్టుల షాక్‌

హైదరాబాద్‌:నీటిపారుదల ప్రాజెక్టులలో వెయ్యి కోట్ల రూపాయలముడుపులు చేతులు మారినట్టుసిపిఎం నాయకుడు బివి రాఘవులుఆరోపించడంతో రాజశేఖరరెడ్డిప్రభుత్వం దాదాపు డిఫెన్స్‌లోపడింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కుమిత్రపక్షంగా పోటీచేసిన సిపిఎం ఇంతతీవ్ర ఆరోపణ చేయడం ఆలోచించాల్సిన విషయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునువ్యతిరేకించడంలో వైఎస్‌తోఏకీభవించడమే కాక ఇంకా ముందున్న సిపిఎం కాంగ్రెస్‌ప్రభుత్వ అవినీతిని మాత్రంసహించలేకపోతోంది. కాంగ్రెస్‌ అవినీతిపైసిపిఐకూడా తోటి కామ్రేడ్స్‌తో గొంతుకలిపే అవకాశముంది.

ఇప్పటికేవామపక్షాలు కేంద్రంలోని యుపిఎప్రభుత్వ ప్రపంచబ్యాంకు అనుకూలవిధానాలను వ్యతిరేకిస్తున్నాయి.గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికిమద్దతు ఇచ్చిన వామపక్షాలు, టిడిపిబిజెపి కలవడంతో దూరమయ్యాయి.ఆర్ధిక సంస్కరణలను, ప్రపంచబ్యాంకుమార్గదర్శకాలను తీవ్రంగావ్యతిరేకిస్తున్న వామపక్షాలునిర్మాణాత్మక పాత్ర పోషించలేకపోతున్నాయి. బిజెపికివ్యతిరేకం కాబట్టి విదిలేని పరిస్ధితుల్లోయుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వామపక్షాలుదేశ రాజకీయాల్లోతమదైన సొంత ముద్రవేయలేకపోతున్నాయి.

సిపిఎంచేసిన అవినీతిఆరోపణలను జీర్ణించుకోలేని వైఎస్‌రాజశేఖరరెడ్డి ఆ పార్టీ గతంలోటిడిపితో సహవాసం చేసినందువల్ల ఆవాసనలు పోవడం లేదని విమర్శించారు.ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌, వామపక్షాలమైత్రికి భంగం వాటిల్లకపోయినప్పటికీ కాంగ్రెస్‌ప్రభుత్వ అవినీతిని ఎప్పటికప్పుడు లెఫ్ట్‌ఎండగట్టే అవకాశముంది.తెలుగుదేశం హయాంలో కంటేఅధికంగా అవినీతి కాంగ్రెస్‌ ప్రభుత్వంలోజరుగుతోందన్న అభిప్రాయంబలపడుతోంది. వైఎస్‌ హయాంలో ఏవోఅధ్బుతాలు జరుగుతాయన్న భ్రమలు క్రమంగా తొలగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+