టిఆర్‌ఎస్ సభతేలిపోతుందా?
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
రాజకీయాలు 16-07-2005
;?
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్‌లోసోమవారం నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభపై తెలంగాణసామాన్యులు పెద్దగా ఆసక్తి చూపడంలేదని వివిధ జిల్లాల నుంచి వస్తున్న వార్తలుసూచిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అధికారంరుచి మరిగాక మారిపోయారని, రోజుకో రకంగామాట్లాడుతున్నారని జనం ఒక అభిప్రాయంఉంది. వర్షాలు బాగా కురిసి, వ్యవసాయపనులు ప్రారంభం కావడం, ఈసారి నక్సలైట్లమద్దతు లేకపోవడం,టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరాసక్తత వల్లవరంగల్ బహిరంగ సభఅనుకున్నంత విజయం సాధించేఅవకాశాలు కన్పించడం లేదు. ఈ నెల 20నఢిల్లీలో వైఎస్- చంద్రశేఖరరావులమధ్య సమావేశం జరుగనున్ననేపధ్యంలో బహిరంగ సభ ప్రాధాన్యంకోల్పోయిందని, కాంగ్రెస్ మీద,వైఎస్ మీద కెసిఆర్ ఘాటైన విమర్శలుచేసే అవకాశం లేదని భావిస్తున్నారు.ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జనానికి పెద్దగాఆసక్తి లేని సభగా మారింది.
ఎన్నికలముందు,కాంగ్రెస్‌తో ఇంకా పొత్తుకుదరనప్పుడు వరంగల్‌లోటిఆర్‌ఎస్ నిర్వహించిన బహిరంగసభకు పది లక్షల మంది తరలి వచ్చారు. అందులో ఎక్కువమంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఆ సభబ్రహ్మాండంగా విజయం సాధించడంతోతెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులు టిఆర్‌ఎస్ పెద్దశక్తిగాఎదిగిందని గ్రహించి, ఆ పార్టీతో పొత్తు కోసంతహతహలాడారు. ఈసారి ఎక్కువ మందిజనం రారని గ్రహించిన టిఆర్ ఎస్ నాయకులు రెండు లక్షలమంది మాత్రమే పట్టే ఆర్ట్స్ కాలేజి గ్రౌండునుబహిరంగ సభకు ఎంచుకోవడంగమనార్హం. పరువు పోకుండా చూసుకోడానికి టిఆర్‌ఎస్ ముఖ్యనాయకులుప్రయత్నిస్తున్నారు.
ఒకఆశయ సాధనకోసం అధికారంలో ఉండి పోరాడడంకంటే అధికారంలో లేకుండా పోరాడడంసులభమని టిఆర్‌ఎస్ ప్రస్తుత స్ధితి చూస్తేఅర్ధమవుతుంది. చంద్రశేఖరరావుమాటకారి కావచ్చుకానీ ఆయన విశ్వసనీయత ఇటీవల బాగాపడిపోయింది. తెలంగాణ రాష్ట్రం గతడిసెంబర్‌లోనే ఏర్పడుతుందనిప్రకటించిన ఆయన కాంగ్రెస్ పార్టీఆలస్యం చేస్తున్నా ఓపిక పట్టడం తెలంగాణఅతివాదులకు నచ్చడం లేదు. చంద్రశేఖరరావు కాంగ్రెస్‌తోకుమ్మక్కయ్యారన్న అనుమానం కూడావీరిలో లేకపోలేదు. తెలంగాణ రాష్ట్రంఏర్పాటు అంత తేలిక కాదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేసినప్పుడల్లాచంద్రశేఖరరావు ఒక ట్రిక్ ప్లే చేస్తున్నారు. వెంటనేసోనియా గాంధీనికలవడం, ఆ తర్వాత కాంగ్రెస్‌రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిని కలిసి చిన్న హామీపొందడం, దాని గురించి పత్రికల వారికిగోరంతలు కొండంతలు చేసి చెప్పడం చంద్రశేఖరరావుకుమామూలై పోయింది. తెలంగాణ సబ్ కమిటీనివేదిక వచ్చే వరకు చంద్రశేఖరరావుఇలాగే కాలక్షేపం చేస్తారు. ఆ నివేదికమీదనే టిఆర్‌ఎస్- కాంగ్రెస్ స్నేహంఆధారపడి ఉంటుంది.
ఇటీవలికథనాలు హోంపేజి












Click it and Unblock the Notifications
