వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు సినిమా పరిశ్రమ ఇంతేనా?

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే;/SPAN> జనరల్‌ 28-10-2005

;?

హైదరాబాద్‌:ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమపూర్తి స్లంప్‌లో పడకపోయినా సంక్షోభంఒడ్డున కొట్టుమిట్టాడుతూనే ఉంది. కొన్నికార్పొరేట్‌ సంస్ధలు, కొందరు ఎన్నారైలు ఈరంగంలోకి ప్రవేశించినా పాతకాలపుపద్ధతులు, సంప్రదాయాలు, నమ్మకాలుఅలాగే కొనసాగుతున్నాయి. ఆధునికటెక్నాలజీ పరిశ్రమను సుసంపన్నం చేసినా సృజనాత్మకత లోపంపరిశ్రమను పీడిస్తూనే ఉంది. ఇటీవలవిడుదలైన పెద్ద సినిమాల్లోఅతడు ఛత్రపతి మాత్రమేపరిశ్రమకు బాసటగా నిలబడ్డాయి.భగీరథ ఆంధ్రుడు సగటు కంటేఎక్కువగా నిలబడి సపోర్ట్‌ను ఇచ్చాయి.

అతడుఛత్రపతి విజయానికి కారణం హీరోలఇమేజి ఒక్కటే కాదు. కథలనుసృజనాత్మకంగా తయారు చేసుకోవడం. అతడుదర్శకుడుత్రివిక్రం శ్రీనివాస్‌ స్వతహాగా మంచి రచయిత కావడం, ఛత్రపతిరచయిత రాజమౌళి తండ్రి ప్రసాద్‌కూడా కొత్తగా రాసే రచయితకావడం ఈ సినిమాలను అగ్రస్ధానంలో నిలబెట్టాయి. ఇప్పటికే రాజమౌళిదర్శకుడిగా టాప్‌ స్లాట్‌లో ఉండగా,త్రివిక్రం దాదాపు ఆ స్ధాయికి ఎదిగాడు.

శ్లాబ్‌సిస్టం ఎత్తివేసిన కారణంగా కొంచెంబాగున్న చిన్న సినిమాలు కూడా యాభై రోజులుఆడే పరిస్ధితి వచ్చింది. శ్లాబ్‌ సిస్టంఎత్తివేయడం భారీ సినిమాలకుఅగ్నిపరీక్షేనని చెప్పాలి. గొప్ప క్వాలిటీ ఉంటేతప్ప భారీ సినిమాలు నష్టాల నుంచితప్పించుకోలేని పరిస్ధితులు ఏర్పడ్డాయి.పెద్ద హీరోల సినిమాలకు ఇది పెద్ద పరీక్షాసమయం. ఈ మధ్య కాలంలో సీనియర్‌హీరోల సినిమాలు మినహాయింపు లేకుండా బాక్సాఫీసువద్ద చతికిలపడుతున్నాయి. తెలుగుసినిమాపరిశ్రమ ఆడంబరంగా ఎన్నోకార్యక్రమాలు చేస్తోంది. కథల విషయంలో కలెక్టివ్‌గా ఇంతవరకుకృషి జరగలేదు. జూబిలీహిల్స్‌లోప్రభుత్వ సహకారంతో ఒకస్వతంత్ర పరిశోధన సంస్ధనుఏర్పాటు చేసి, దానికి అనుబంధంగా ఒకసిడి లైబ్రరీ, పుస్తక భాండారంపెట్టుకుంటే మంచిది. దీనికి ప్రభుత్వసహకారంతో పాటు పరిశ్రమలోని ప్రముఖులచేయూత అవసరం. ఏటా కొన్ని వందల కోట్లటర్నోవర్‌ గల తెలుగు చిత్ర పరిశ్రమస్కిల్స్‌ను అప్‌డేట్‌ చేసుకోడానికి ఇటువంటిప్రయత్నం చేయడం అత్యవసరం.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X