వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైనల్‌కుచేరిన సానియా

By Staff
|
Google Oneindia TeluguNews
హైదరాబాద్‌:హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌టోర్నమెంట్‌లో సానియా మీర్జా సొంత గడ్డమీది అభిమానుల ఆశలను చివరి దాకానిలబెడుతోంది. సానియా మీర్జాహైదరాబాద్‌ ఓపెన్‌లో ఫైనల్‌కుచేరుకొని హైదరాబాద్‌ ప్రేక్షకులఆశలను నిలబెట్టింది.

ఉత్కంఠభరితంగాసాగిన మొదటిసెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో సానియా రష్యాకుచెందిన ఎనిమిదో సీడ్‌ మార్యా కిర్లోంకోనుఓడించింది. రెండు వరస సెట్లలో విజయంసాధించి తన సత్తాను చాటింది.కిర్లోంకోపై సానియా 6- 4, 7- 6స్కోర్‌తో విజయం సాధించింది. మొదటిసెట్‌ను సునాయసంగా గెలుచుకున్నసానియా రెండో సెట్‌లో చెమటోడ్చాల్సి వచ్చింది.టై బ్రేకర్‌తో ఆమె రెండో సెట్‌నుగెల్చుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది.గాయం కారణంగా హైదరాబాద్‌ఓపెన్‌లోనే అడదనుకున్న సానియాతన సొంత గడ్డ మీది అభిమానులనునిరాశ పరచడం ఇష్టం లేక పోటీలకుదిగింది. నామమాత్రంగా కాకుండావిజయకాంక్షతో ఆమె పోరాడుతోంది.

సానియాఫైనల్‌లో ఉక్రయిన్‌కు చెందిన బడారెంకాను ఎదుర్కుంటుంది. రెండో సెమీఫైనల్‌ నుంచి గాయం కారణంగా గ్రోన్‌ఫీల్డ్‌ తప్పుకోవడంతో బండా రెంకాఫైనల్‌కు చేరుకుంది.

క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో తాను గట్టిగాపోరాడాల్సి వచ్చిందని, అది టఫ్‌ మ్యాచ్‌ అని సెమీఫైనల్‌లో గెలిచిన అనంతరం సానియామీర్జా అన్నది. ఆమె మాట మాటకు అభిమానులనుంచి పెద్ద పెట్టున హర్షాధ్వానాలువ్యక్తమయ్యాయి. ఇటీవల సానియా మీర్జాఆస్ట్రేలియా ఓపెన్‌ మూడో రౌండ్‌కుచేరుకున్న తొలి భారతీయ మహిళాక్రీడాకారణిగా రికార్డు సృష్టించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X