టిఆర్‌ఎస్ బహుముఖ వ్యూహం
హోంపేజి
టాక్ ఆఫ్ టుడే
రాజకీయాలు 17-06-2005
హైదరాబాద్:పదవులకు రాజీనామా చేయమనిటిఆర్‌ఎస్ నాయకులకు జనశక్తి నక్సలైట్లు అల్టిమేటం ఇచ్చిన నేపధ్యంలోగ్రామస్ధాయి టిఆర్‌ఎస్ నాయకులు ఆ పార్టీకిరాజీనామా చేయడం ప్రారంభమైంది.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్ననేపధ్యంలో చంద్రశేఖరరావు నిన్నబిజెపి నాయకులను కలిసి మద్దతుకోరడం వ్యూహాత్మకమైనది. ఇది ఒకరకంగా యుపిఎ ప్రభుత్వానికి హెచ్చరికవంటిది. అదే సమయంలో ఇది పులి మీదస్వారీ లాంటి చర్య కూడా.
విధిలేనిపరిస్ధితిలో చంద్రశేఖరరావు బిజెపి నాయకులమద్దతు కోరారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నసిపిఎం మద్దతు ఉపసంహరించుకుంటేమన్మోహన్ సింగ్ ప్రభుత్వంపడిపోవడం ఖాయం. తెలంగాణరాష్ట్రం కోసం కేంద్రప్రభుత్వంపడిపోకుండా బిజెపి మద్దతు ఇస్తుందాఅన్నది సందేహమే. ఈనెల పదిహేనోతేదీలోపు కాంగ్రెస్‌కు మద్దతుఉపసంహరించుకోవాలని టిఆర్‌ఎస్‌కు నక్సలైట్లుచేసిన హెచ్చరిక విషయంపై టిఆర్‌ఎస్ ఎంపీలు ప్రధానిమన్మోహన్ సింగ్‌తో శుక్రవారం చర్చించినట్టు తెలిసింది. ఇది ఒకరకంగాతెలంగాణ రాష్ట్రం విషయమైమన్మోహన్ మీద వత్తిడి తేవడమే.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామనిప్రధాని హామీ ఇచ్చేలా వారు స్కెచ్‌వేసుకున్నారు.
తెలంగాణరాష్ట్రం ఏర్పాటుకు బద్ధ వ్యతిరేకిగాఉన్న ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డిపై కాంగ్రెస్‌అధిష్టానవర్గానికి చాడీలు చెప్పాలన్నది కూడా టిఆర్‌ఎస్ వ్యూహంలాకన్పిస్తోంది.వైఎస్ హయాంలో అనేక కుంభకోణాలుజరుగుతున్నాయంటూ వాటికిసంబంధించిన డాక్యుమెంటేషన్‌ప్రక్రియను టిఆర్‌ఎస్ నాయకులు ప్రారంభించారు.అయితే వైఎస్ మీదప్రస్తుతానికి అధిష్టానవర్గానికి అచంచలవిశ్వాసం ఉంది. ఆయనను ఇప్పట్లో కదిలించేసాహసం చేయరు. అయితే వైఎస్‌కుకొంతైనా అస్ధిరపరచాలన్నది టిఆర్‌ఎస్‌ఆలోచన. వైఎస్‌ను, చంద్రబాబు నాయుడినిసమాన శత్రువులుగాటిఆర్‌ఎస్ పరిగణిస్తోంది.
ఇకవిజయశాంతి ఫ్యాక్టర్‌ను టిఆర్‌ఎస్‌లైట్‌గా తీసుకొంటున్నది. పిల్ల కాకికేంతెలుసు ఉండేలు దెబ్బ అని విజయశాంతినిఉద్దేశించి కెసిఆర్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది.విజయశాంతి తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయోతెలియదని, కృష్ణాజిల్లా భాషలో మాట్లాడుతున్నఆమెను తెలంగాణప్రజలు ఎలా నమ్ముతారని టిఆర్‌ఎస్ నాయకులుధీమాగా ఉన్నారు. కేంద్రంలోరాష్ట్రంలో మంత్రి పదవుల్లో ఉండకండాతెలంగాణ సాధించడం కుదరదని చంద్రశేఖరరావు గట్టినమ్మకంతో ఉన్నారు. నక్సలైట్ల హెచ్చరికలకుబెదరకుండా తెలంగాణరాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడాలని ఆయన నిశ్చయించుకున్నారు.
Recent Stories- లేడీబాస్ మాస్టర్‌ప్లాన్
- కెసిఆర్ ఢిల్లీ మంత్రాంగం
- మామూలై పోయిన మామూళ్ళు!
- తెలంగాణపై మళ్ళీ దోబూచులాట!
- తెలంగాణ వచ్చుడో, కెసిఆర్ చచ్చుడో
- తారల ప్రభావం నిల్!
- ఉద్వేగ అంశాలు
- తారల ప్రభావం నిల్!
- ఇప్పటికిప్పుడు చెరిసగం
- పార్టీ టికెట్ల మార్కెటింగు
- చిరంజీవి రహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం
- కెసిఆరే పెద్ద ఫ్యాక్టర్
- పార్టీ టికెట్ల మార్కెటింగు
- చిరంజీవి రహస్య ఎజెండా?
- అస్పష్ట రాజకీయ చిత్రం హోంపేజి












Click it and Unblock the Notifications
