వైఎస్‌ప్రస్తుతానికి సేఫ్‌

YSRహైదరాబాద్‌:రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పూర్తి కాలంఅధికారంలో కొనసాగుతుందా అన్నప్రశ్న ఇప్పుడు సర్వసాధారణంగావిన్పిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్‌ పాలితరాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను తరచుమార్చడం లేదు. ఇందిరాగాంధీహయాంలో ఆరునెలలకో ముఖ్యమంత్రినిమార్చేవారు. సోనియాగాంధీ కాంగ్రెస్‌పగ్గాలు చేపట్టిన తర్వాత తరచుముఖ్యమంత్రులను మార్చకూడదనినిర్ణయం తీసుకున్నారు.

నీటిపారుదలప్రాజెక్టుల నిర్మాణంలో కాస్త సాఫల్యంచూపించగలగితే, ఏదో చేస్తున్నారన్నఅభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. వైఎస్‌మీద అధిష్టానవర్గానికి కూడా సీరియస్‌ఫిర్యాదులు లేవు. రాజశేఖరరెడ్డిపదవికి ముప్పు తేగలిగిన శక్తిటిఆర్‌ఎస్‌ అధినేతచంద్రశేఖరరావుకు ఉంది. వైఎస్‌మరో ముప్పు అసమ్మతి వర్గంతో ఉంటుంది.ఇప్పటివరకు ఆయన మీద ఉన్నదిఅసంతృప్తే కానీ అది అసమ్మతి స్ధాయికిఇంకా చేరుకోలేదు. మరి కొద్ది నెలల్లో ఇదిఅసమ్మతి రూపం సంతరించుకునేఅవకాశముంది.

అసమ్మతి ఒకరూపం సంతరించుకుంటే పిసిసి మాజీఅధ్యక్షులు ఎం. సత్యనారాయణ రావు,డి. శ్రీనివాస్‌లు లీడ్‌ తీసుకునేఅవకాశముంది. మంత్రివర్గాన్నివిస్తరించాక, లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ను ఏర్పాటుచేశాక అసమ్మతి ఒక రూపంసంతరించుకుంటుంది. నేదురుమల్లిజనార్ధనరెడ్డికి ఇప్పుడు వైఎస్‌తోపోరాడే ఓపిక లేదు. వైఎస్‌ గొప్పప్రజాకర్షణ గల నాయకుడని గులాంనబీ ఆజాద్‌ వంటి వారుఅధిష్టానవర్గానికి లిఖిత పూర్వకంగానివేదిక సమర్పించారు. వైఎస్‌నుఅర్ధంతరంగా దింపితే ప్రజల్లోకాంగ్రెస్‌పై అసంతృప్తిఏర్పడుతుందన్న ఉద్దేశంఅధిష్టానవర్గానికి ఉంది కాబట్టి ఇప్పట్లోమార్పు అంత తేలిక కాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+