వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్‌పైసానుభూతి

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ 07-07-2005

YSRహైదరాబాద్‌:టిఆర్‌ఎస్‌తో వివాదం కారణంగాకాంగ్రెస్‌ శ్రేణుల్లో ఎప్పుడూలేనంతఐక్యత ఏర్పడింది. ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర రెడ్డి అంటే గిట్టని పి.జనార్ధనరెడ్డి వంటి కాంగ్రెస్‌ నాయకులుకూడా ఆయనకు అనుకూలంగా మారుతున్నారు.ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తిని పరాయి పార్టీవ్యక్తి సరసన నిలబెడతానని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్‌ మీదకాంగ్రెస్‌ నాయకులు మండిపడుతున్నారు. వైఎస్‌నుఫ్యాక్షనిస్టుగా విమర్శించిన వ్యక్తిని నెత్తిమీద కూర్చోబెట్టుకోవడమేమిటని వారిప్రశ్న. టిఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖరరావుకు అధిష్టానవర్గంఅనవసర ప్రాధాన్యమిస్తోందన్నదిరాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ప్రధానఫిర్యాదు.

టిఆర్‌ఎస్‌తోపొత్తు కారణంగా గత ఎన్నికల్లోఅవకాశం కోల్పోయిన కాంగ్రెస్‌ నాయకులకు, టిఆర్‌ఎస్‌కుమంత్రివర్గంలో స్ధానం కల్పించిన కారణంగామంత్రులు కాలేకపోయిన కాంగ్రెస్‌ఎమ్మెల్యేలకు టిఆర్‌ఎస్‌ శత్రువుగా మారింది. టిఆర్‌ఎస్‌ మీద వెంకటస్వామివంటి కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీలువ్యంగ్య బాణాలు విసురుతున్నారు.కరీంనగర్‌ జిల్లా నుంచి కేంద్ర మంత్రివర్గంలోకిచంద్రశేఖరరావును తీసుకోవడంతోవెంకటస్వామికి అవకాశం రాకుండా పోయింది. ఆయనబాధ అది.

వచ్చేమునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌-టిఆర్‌ఎస్‌ విడివిడిగా పోటీ చేసే అవకాశాలుకన్పిస్తున్నాయి. టిడిపి- బిజెపిల హనీమూన్‌కూడా ముగిసింది. ఈనేపధ్యంలో రాష్ట్ర రాజకీయ రంగంఆసక్తికరంగా మారింది. వైఎస్‌రాజశేఖరరెడ్డి విదేశాల నుంచి తిరిగి వచ్చాక ఇంకా రసకందాయంలోపడుతుంది. అధిష్టానవర్గానికి,వైఎస్‌కు మధ్య ఈ మధ్య అంతరంపెరిగినట్టు కన్పిస్తోంది. ఆయనను గొప్పప్రజానాయకుడిగా భావిస్తూ వచ్చినకాంగ్రెస్‌ అధిష్టానానికి ఈ మధ్యఫిర్యాదులు బాగా అందాయి. మునిసిపల్‌ఎన్నికల్లో కాంగ్రెస్‌ దెబ్బతింటే వైఎస్‌నుమార్చే విషయాన్ని అధిష్టానవర్గంపరిశీలించవచ్చు. చంద్రశేఖరరావుఅదే పనిగా వైఎస్‌ మీద అధిష్టానవర్గానికిఫిర్యాదులు చేస్తున్నారు. డాక్యుమెంటేషన్‌లోదిట్ట అయిన చంద్రశేఖరరావు వైఎస్‌ మీద పెద్దఫైల్‌ను సోనియాగాంధీకి సమర్పించినట్టుతెలిసింది. రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఉన్నప్పటికీ ఢిల్లీలోమాత్రం కెసిఆర్‌ వైఎస్‌కు కంట్లో నలుసుగా,చెవిలో జోరీగలాతయారయ్యారు.

ఇటీవలి కథనాలు హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X