బాలకృష్ణపై కేసు మళ్ళీ....

బాలకృష్ణ మీద ఆ కేసును తిరగదోడాల్సిన అవసరం లేదని, పోలీసు రికార్డుల్లో ఆ కేసును క్లోజ్ చేయలేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం ఇక్కడ ప్రధానాంశం. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వారికి కొన్ని సంకేతాలు అందినట్టే కనిపిస్తోంది. బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల కేసుపై మళ్ళీ పోలీసులు ఉత్సాహం చూపిస్తే ఏమవుతుంది. ఆ కేసులో సాక్ష్యాలు సరిగా లేవు. పైగా బాధితులు బెల్లంకొండ సురేష్, సత్యనారాయణ చౌదరి ఇద్దరూ తమపై బాలకృష్ణ కాల్పులు జరపలేదని కోర్టు ముందు వాంగ్మూలం ఇచ్చారు. అయినా పోలీసులు తలచుకుంటే ఆ కేసుని తిరగదోడడం పెద్ద కష్టం కాదు.
బాలకృష్ణపై నేరాన్ని నిరూపించలేకపోయినా పోలీసుల హడావుడి వల్ల జనం మర్చిపోయిన ఆ కాల్పుల సంఘటన జనానికి గుర్తు చేసినట్టు అవుతుంది. హీరో బాలకృష్ణను విలన్ గా చేసినట్టు అవుతుంది. ఈ విషయంలో బాలకృష్ణకు స్పష్టమైన సంకేతాలు అందినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన తెలుగుదేశం తరఫున ప్రచారానికి తొందరపడడం లేదు. ఎన్నికలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేనందున డిసెంబర్ మూడో వారం నుంచి ప్రచారం చేస్తానని, తనను అనవసరంగా తొందర పెట్టవద్దని ఆయన చంద్రబాబు నాయుడితో అన్నట్టు తెలిసింది.
బాలకృష్ణ రంగంలోకి దిగడానికి ఆలస్యం చేయడంతో అసహనం చెందిన చంద్రబాబు నాయుడు రెండు మూడు రోజుల్లో కుటుంబ సమేతంగా మలేషియా వెళ్ళి ఆయనను కలుసుకోనున్నట్టు తెలిసింది. బాలకృష్ణ ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం మలేషియాలో ఉన్నారు.












Click it and Unblock the Notifications