• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సామాజిక అన్యాయం

By Staff
|

Chiranjeevi
హైదరాబాద్: సామాజిక న్యాయం అంటే ఏమిటి? ఆ పదం చిరంజీవికి నచ్చి ఉండవచ్చు, ఆయన సలహాదారులు చెప్పినట్టుగా చిలక పలుకులు పలకవచ్చు. ఈరోజు ఒక పాఠకుడు ఆలోచన రేకెత్తించే మెయిల్ పంపించాడు. అగ్రవర్ణాలు వారిలో ఎవరు అధికారంలో ఉన్నా వ్యాపారంలో అందరూ ఒకటవుతారు. పంచుకుంటారు. నంజుకుంటారు. వెనుకబడిన కులాలకు దిక్కెవరు అన్నది ఆ పాఠకుడు వేసిన ప్రశ్న.

ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు సామాజిక న్యాయం అనే మంత్రాన్నే జపిస్తున్నాయి. ఓట్లు బిసి,ఎస్ సి, ఎస్టీలవే ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 అసెంబ్లీ టికెట్లను బీసీలకు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అంతకు తగ్గకుండా తాము కూడా బీసీలకు టికెట్లు ఇస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి శ్రీనివాస్ చెబుతున్నారు. సమాజంలో బిసీ, ఎస్ సి, ఎస్టీలు డెబ్బై శాతానికి పైగా ఉంటారు. ఎన్నికల సమయంలోనే రాజకీయ పార్టీలు వీరి గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఎన్నికల తర్వాత అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా కాంట్రాక్టులు ఆ రెండు మూడు పెత్తందారీ కులాల వారికే వెళ్తుంటాయి.

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత కాన్షీరామ్ అన్న మాటలను ఇక్కడ కోట్ చేయవలసి వస్తోంది. " ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ అంటే రెడ్డి, కమ్మ కాంబినేషన్. తెలుగుదేశం అంటే కమ్మ, రెడ్డీ కాంనేషన్. మొదటి స్ధానాలు అటు ఇటు అవుతుంటాయి తప్ప అధికారం ఆ వర్గాల చేతుల్లోనే ఉంటుంది" అని ఆయన విలేకరుల సమావేశంలో చెప్పారు. అది రికార్డ్ అయిన ప్రెస్ కాన్ఫరెన్స్. ఆయన పునాదులు వేసిన బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పుడు దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉంది. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు బిఎస్ పికి పెద్ద ప్రభావం లేదు. బాగా డబ్బు సంపాదించుకున్న బిసీ, ఎస్ సి నాయకులు కాంగ్రెస్, తెలుగుదేశం, లేదంటే డబ్బు పెట్టి అయినా ప్రజారాజ్యం పార్టీలోకి చేరి టికెట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపధ్యంలో సామాజిక న్యాయం అనే పదానికి అర్ధం లేదు. దిగువ వర్గాల నుంచి ఎదిగి వచ్చిన వారు పెత్తందారీ వర్గాలతో సహచర్యం చేసుకుంటున్నారు కాబట్టి. చిరంజీవికి స్వయంగా ఆ సామాజిక న్యాయం అనే పదానికి సంబంధించి సామాజిక సత్యం తెలియదు. తండ్రి ఎ క్సైజ్ కాని స్టేబుల్ కాబట్టి వివిధ పట్టణాల్లో చిరంజీవి బాల్యం గడిచింది. కానీ గ్రామాల్లో అగ్రకులాల ఆధీపత్యం కింది అణగారుతున్న కులాల పరిస్ధితి చిరంజీవికి తెలియదు. ఆయన ఆ విషయం తెలుసుకునే లోపే ఎన్నికలు అయి పోతాయి. సామాజిక అన్యాయం మరీసారి జరగక మానదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X