వర్మ'రక్త చరిత్ర'టూరు పబ్లిసిటీ స్టంటా?

నిన్న (ఆదివారం) వెంకటాపురం వెళ్ళి పరిటాల సునీతని,వారి బంధు వర్గాన్ని కలిసారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ మద్దెల చెర్వు సూర్యానారాయణ రెడ్డితో పాటు పరిటాల రవి సతీమణి, శాసనసభ్యురాలు పరిటాల సునీత సినిమా తీయడానికి అంగీకరించినట్లు ఆయన తెలిపారు. అలాగే..తన సినిమా ఎవరినీ బలపరిచేదిగా ఉండదని, సందేశాత్మకంగా ఉంటుందని ఆయన చెప్పారు. తన రక్తచరిత్ర సినిమాకు మద్దెలచెర్వు సూరి పెట్టుబడి పెడుతున్నారనే వార్తలను ఆయన ఖండించారు. సినిమా మొత్తం రాయలసీమ జిల్లాల్లోనే షూటింగ్ జరుపుకుంటుందని ఆయన చెప్పారు. నవంబర్ 20వ తేదీ నుంచి షూటింగ్ జరుపుతామని ఆయన చెప్పారు.
అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంటే నని ఓ వర్గం తిట్టిపోస్తోంది. ఇలా తన టూరుని సంచలనంగా మార్చుకున్న వర్మ ఇదంతా మీడియా దృష్టినీ తద్వారా సినిమా రిలీజ్ కి ముందే తగినంత ప్రచారం రప్పించటానికే చేస్తున్నాడనేది వారి వాదన. గతంలోనూ సర్కార్ సినిమా తీస్తూ అందులో అమితాబ్ పాత్రకు ...భాలే థాకరే గెటప్ ని అనుకరించి తీర్చిదిద్దారని గుర్తు చేస్తున్నారు.అలాగే మాఫియా పై సినిమా చేస్తే మాఫియా నేతల నుండి సినిమా ఆపమని కాల్స్ వచ్చాయని రూమర్స్ పుట్టించటం ఆయనకు అలవాటే నని వారు విశదీకరిస్తున్నారు.
అంతేగాక ఈ మధ్య ఆయన చేతబడుల నేపద్యం లో తీసిన ఫూంక్ సినిమాను ఒంటరిగా చూస్తే ఐదు లక్షలు ఇస్తాననటం,దాని తెలుగు రీమేక్ వెర్షన్ రక్ష కు కూడా చేతబడులు ఉన్నాయని నిరూపిస్తే...అంటూ రిలీజ్ కు ముందే రకరకాలుగా స్టేట్ మెంట్స్ ఇస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేయటాన్ని ఉదహరిస్తున్నారు. ఇక ఇవన్నీ చేయటం వెనుక సినిమా ఓపినింగ్స్ సాధించటమే ప్రయోజనం అనేది పరమార్ధం అని వారంటున్నారు.
మరో ప్రక్క వర్మ రాకకి... రక్తచరిత సినిమా తీయటంపై జిల్లా నేతలు అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ సినిమా వల్ల రెండు వర్గాల మధ్య ఉద్రిక్తలు తలెత్తుత్తాయని కొందరు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్న తాము ఫ్యాక్షన్‌ను వ్యాపారంగా వాడుకోవడాన్ని సహించబోమన్నారు.
అలాగే రక్త చరిత్ర సినిమాను ధర్మ,రక్ష అనే కవల సోదరులు డైరక్ట్ చేయబోతున్నారు. సత్య,కంపెనీ తరహాలో ఈ చిత్రాన్ని వాస్తవ సంఘటనల సమాహారంగా చూపాలని వర్మ భావిస్తున్నట్లు అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే శివ రిలీజ్ అయ్యాక ఎవరు కాదన్నా అవునన్నా చైన్ బ్యాచ్ లంటూ చాలా వెలిసాయి. కాలేజీల్లో పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి.అదే రీతిలో ఈ రక్త చరిత్ర ప్రభావం సమాజం పై పడిందంటే ప్రమాదమే. అయినా వర్మ తన స్వప్రయోజనం కోసం మర్చిపోతున్న ఫ్యాక్షన్ కక్షలను మరలా తిరగతోడి అక్కడి వారిని రెచ్చగొట్టాల్సిన అవసరముందా...దానికింత పబ్లిసిటీ చెయ్యాలా అనేది మేధావులని ఆలోచనలలో పడేస్తున్న ప్రశ్న.












Click it and Unblock the Notifications