కాంగ్రెస్ శిబిరంలో నైరాశ్యం?

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ఇంతలోనే ఎంత మార్పు! అధికారం కోల్పోయినట్టే కనిపిస్తోంది కాంగ్రెస్ నాయకుల ధోరణి. ముఖ్యమంత్రి తనయుడు వైఎస్ జగన్ పై నర్సరావుపేట పోలీసులు తప్పుడు కేసు పెట్టారని వైఎస్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త డిజిపి మహంతి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నది వారి అక్కసుగా కనిపిస్తోంది. వైఎస్ జగన్ ముద్దుల పుత్రిక అయిన "సాక్షి" దినపత్రిక సిబ్బంది నేడు డిజిపి కార్యాలయం ఎదుట ఎర్రని ఎండలో ధర్నా చేశారు. తమ యజమానిని పోలీసులు వేధిస్తున్నారన్నది సాక్షి జర్నలిస్టుల ఆవేదన. ఇంకా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ హఠాత్తుగా ప్రతిపక్షంలో ఉన్నట్టు ఫీల్ కావడానికి కారణమేమిటి? విశాఖ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిని దగ్గుబాటి పురంధరేశ్వరిలో అయితే ఓడిపోతున్నానన్న భావన స్పష్టంగా కన్పిస్తోంది. తెలుగుదేశం నగదు బదిలీ పథకం ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఉద్దేశించినదంటూ, తగిన చర్యలు తీసుకోమని ఆమె ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఎందుకు? ఎన్నికలు ముగిసిపోయిన తర్వాత ఆ ఫిర్యాదుకు విలువ ఉండదన్న విషయం ఆమెకు తెలియదా?

రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. మరో మూడున్నర రోజుల్లో ఫలితాలే వెలువడనున్నాయి. రాష్ట్రంలోనూ హంగ్ తరహా వాతావరణం కన్పిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనన్ని స్ధానాలు రావడం లేదన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఆలస్యంగా గ్రహించారు. అటు మహాకూటమికి కూడా ఆ భయం పట్టుకుంది. సందట్లో సడేమియాలా దూరిన చిరంజీవి శిబిరంలో మాత్రం ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆ కొన్ని తప్పులు చేయకుండా ఉంటే అధికారం బంగారు పళ్ళెంలో పెట్టినట్టు అంది ఉండేదని చిరు శిబిరం మేధావులు అభిప్రాయం. ఇప్పటికీ రాష్ట్రంలో తమదే ప్రధాన పార్టీ అని వారు నమ్ముతున్నారు.

కడప జిల్లాలో విశ్రాంతి తీసుకుంటున్న వైఎస్ నిన్న తన మిత్రులు, బంధువులతో రహస్య సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. మెజారిటీకి కొద్దిగా తక్కువ సీట్లు వచ్చినా లెఫ్ట్ పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని వైఎస్ వారిని సముదాయించి పంపారట. వైఎస్ హయాంలో బాగు పడిన అందరికీ ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష ఉండడం సహజమే. కానీ ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ఏమై పోతామోనన్న దిగులు కూడా వారిలో కనిపిస్తోంది. సాక్షి మీడియా గ్రూపు సిబ్బందిలోనూ ఆ భయం గోచరమవుతోంది. ముఖ్యమంత్రి కుమారుడిని మీద తప్పుడు కేసు పెట్టారంటూ సాక్షి పత్రికా సిబ్బంది ఎర్రటి ఎండలో డిజిపి కార్యాలయం ఎదుట ధర్నా చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇవన్నీ వేటికి సంకేతాలు? మూడున్నర రోజులు ఆగాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+