చిరంజీవి పార్టీలో లుకలుకలు!

కృష్ణా జిల్లా వరకు చిరంజీవి రాజకీయ వ్యూహాల బలహీనత బయట పడింది. విజయనిర్మలను కృష్ణా రూరల్ కన్వీనర్ గా నియమించడంతో మొదలైన గొడవ రాష్ట్రానికంతటికీ పాకింది. పెద్ద మనిషి అయిన కెపి రెడ్డయ్యను చిరంజీవి ఆశ్రయించి ఆ జిల్లా బాధ్యతలను అప్పగించాలని ఆలొచిస్తున్నట్టు తెలుస్తోంది.
సంస్ధాగత నిర్మాణంలో చిరంజీవి పార్టీ బాగా వెనుకబడి ఉంది. చిరంజీవిని, పవన్ కల్యాణ్ ను చూడడానికి జనం వస్తున్నా వారు ఎన్టీఆర్ లాగా ఒక పవర్ ఫుల్ మెసేజ్ ని ఇవ్వలేకపోతున్నారు. తన పార్టీకి కాపు కులం ముద్ర పడకుండా చిరంజీవి ఎంత జాగ్రత్త పడినా కృష్ణా జిల్లా విషయంలో ఆయన డొల్లతనం బయట పడింది.
చిరంజీవి పార్టీకి ముప్పైకి మించి స్ధానాలు రావని ఇప్పటికిప్పుడు తాజా అంచనాల ప్రకారం తెలుస్తోంది. అయితే హంగ్ అసెంబ్లీ వస్తే కీలక పాత్ర వహించాలని ఆయన ఆలోచిస్తున్నట్టు సమాచారం.












Click it and Unblock the Notifications