షాక్ మరణాల మిస్టరీ

మృతుల కుటుంబాలకు 5 వేల నుంచి 15 వేల రూపాయల వరకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు జగన్ సేన లేదా బ్రిగేడ్ సహజ మరణాలకు సంబంధించిన కుటుంబాలకు కూడా డబ్బులు పంచినట్లు చెబుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరిన్ని డబ్బులు ఇస్తామని కూడా జగన్ బ్రిగేడ్ కార్యకర్తలు చెబుతున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు వరంగల్ లో వ్యక్తిగత మరణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఇద్దరి మరణాలను కూడా వైయస్ ఖాతాలో జమ చేశారని అంటున్నారు. మరణాల సంఖ్యను ఎక్కువ చేసి చూపుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. పొన్నూరులో ఒక యువకుడు మరణించాడు. దాన్ని వైయస్ ఖాతాలో వేసి కాంగ్రెసు నాయకులు డబ్బులు ఇచ్చారు. తీరా చూస్తే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని తేలింది.
వైయస్ మృతి తర్వాత సంభవించిన మరణాల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్లు తమ కింది అధికారులను ఆదేశిస్తున్నారట. దీంతో రెవెన్యూ శాఖ రంగంలోకి దిగి పని చేపట్టింది. మరణానికి ముందు వైయస్ అంత్యక్రియలు చూశారా, లేదా అని రెవెన్యూ అధికారులు మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సహాయం అందిస్తామని అధికారులు చెబుతుండడంతో వైయస్ మృతికి షాక్ తినే మరణించారని కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు సేకరించిన మృతుల జాబితాను జగన్ శిబిరానికి అందించారని, దాన్ని మీడియాకు విడుదల చేశారని అధికారులు చెబుతున్నారు. వైయస్ సంతాపదినాలు ఈ నెల 10వ తేదీన ముగిశాయి. ఇప్పటికీ సంభవిస్తున్న మరణాలను కూడా వైయస్ ఖాతాలో వేస్తున్నట్లు సమాచారం. ఏమైనా, కాంగ్రెసు రాజకీయాలు వైయస్ మృతిపై ఆధారపడి మలుపు తిరిగి కొంత విషాదకరంగా కూడా మారాయి.












Click it and Unblock the Notifications