ఆ రెండు, చిరు!

గతంలో రాజశేఖరరెడ్డి కూడా ఆ రెండు పత్రికలమీ దే విమర్శలు చేశేవారు. ఆయన సొంత పత్రిక సాక్షి పెట్టుకున్న తర్వాత ఆ విమర్శలు తగ్గిపోయాయి. ఇప్పుడు పార్టీని పూర్తి స్ధాయిలో నడపలేని స్ధితికి వచ్చిన చిరంజీవి కాంగ్రెస్ తో మరీ ముఖ్యంగా వైఎస్ తో రాజీ పడ్డారన్నది సమాచారం.
ఇప్పుడు చిరేంజీవితో ఆ రెండు పత్రికల మీద దాడి చేయిస్తున్నది వైఎస్ రాజశేఖరరెడ్డే అని కొన్ని వర్గాల కథనం. మెగాస్టార్ ముఖ్యమంత్రి అవుతారనుకున్న వారికి చిరంజీవి అసెంబ్లీలో "చిరు"గా కన్పిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి వైఎస్ తో కుమ్మక్కయ్యారన్నది మరో సమాచారం. దీనితో చిరు పార్టీలోని మిగితా 17 మంది ఎమ్మెల్యేలు బెంబేలెత్తున్నారు. ఒక చోట చిరంజీవి స్వయంగా ఓడిపోయిన సందర్భంలో గెలిచిన ఎమ్మెల్యేలు గొప్పగా ఫీలవుతున్నారు.
చిరంజీవి ప్రజారాజ్యం త్వరలో కూలిపోతుందని రాసిన ఈనాడు పత్రిక మీద చిరు జనం ఆనేక చోట్ల దాడులు చేశారు. వైఎస్ కోరుకుంటున్నది అదే, చిరు అభిమానులు చేస్తున్నది అదే.












Click it and Unblock the Notifications