చిరంజీవి బాధ

అయితే, సరిగ్గా ఇదే సమయంలో చిరంజీవిని సినీ పరిశ్రమ నుంచి వెన్నంటి ఉన్న ఆయన ఆత్మబంధువు వద్ద వైఎస్ సన్నిహితులు మరో ప్రతిపాదన పెట్టారు. వచ్చే ఏడాది జరిగే రాజ్యసభ ఎన్నికల్లో చిరంజీవిని రాజ్యసభకు పంపించి, ఆయనకు కేంద్రమంత్రి పదవి..ఆయనతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలకు రాష్ట్రంలో క్యాబినెట్ పదవులూ ఇస్తామని కాంగ్రెస్ దూతలు ప్రతిపాదించగా అందుకు సదరు ఆత్మబంధువు అంగీకరించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తమకున్న బలం, వాస్తవ పరిస్థితి అంచనా వేసుకుంటే కాంగ్రెస్ ప్రభు త్వంపై ఏ స్థాయిలోనూ ధీటుగా పోరాడే శక్తి, వనరులు, యంత్రాంగంలేని వైనం కూడా పీఆర్పీ..కాంగ్రెస్ కు స్నేహ హస్తం అందించడతానికి మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉన్నం దున, మంత్రి పదవుల సాయంతో రెండు మూడేళ్లలో పార్టీని పటిష్టం చేసుకోవచ్చని పీఆర్పీని తెరవెనుక ఉండి నడిపిస్తోన్న ఆత్మబంధువు భావించినందునే పీఆర్పీ- కాంగ్రెస్ మైత్రీ బంధం వికసించనున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగానికి సదరు ఆత్మబంధువే దర్శకత్వం వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications