హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరుతో మోహన్ బాబు స్నేహం!

By Staff
|
Google Oneindia TeluguNews

Mohan Babu
హైదరాబాద్: అనేక సామాజిక, కుల, రాజకీయ కారణాల వల్ల చిరంజీవితో ఢీ అంటే ఢీ అన్న మోహన్ బాబు ఇప్పుడు చిరంజీవితో మంచిగా మసలుకుంటున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మోహన్ బాబు గురువు దాసరి నారాయణరావు చిరంజీవికి వ్యతిరేకంగా ప్రచారం చేసినా మోహన్ బాబు గమ్మున ఊరుకున్నాడు. గురువు దాసరి బాటలో చిరంజీవికి వ్యతిరేకంగా తిరుపతిలో మోహన్ బాబు ప్రచారం చేసి ఉన్నట్టయితే చిరంజీవి నిస్సందేహంగా ఓడిపోయి ఉండేవారు. కానీ మోహన్ బాబు ఆ విషయంలో సంయమనం పాటించారు. చిరంజీవి స్వల్ప మెజారిటీతో తిరుపతిలో గెలుపొందిన విషయం తెలిసిందే.

కుమారుడు విష్ణు కులాంతరమే కాకుండా మతాంతర వివాహం చేసుకోవడం మోహన్ బాబులో పరిపక్వతని పెంచినట్టు పరిశీలకులు చెబుతున్నారు. మోహన్ బాబు వియ్యంకుడు స్వయానా ముఖ్యమంత్రి వైఎస్ సొంత తమ్ముడు. కోడలు వెరోనికా కులం పరంగా రెడ్డి అయినప్పటికీ ఆమె తలిదండ్రులు క్రిస్టియన్ మతం పుచ్చుకున్నారట.

తెలుగు సినిమా గోల్డెవ్ జూబిలీ సందర్భంగా ఒక ఫంక్షన్ లో మాహన్ బాబు, చిరంజీవి సోదరుల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. చిరంజీవికి వ్యతిరేకంగా మోహన్ బాబు మాట్లాడగా, మోహన్ బాబు మొహం బద్దలయ్యేలా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఆ తర్వాత ఆ వైరం చాలా కాలం కొనసాగింది.

మోహన్ బాబు, చిరంజీవిల మధ్య తగవులాట పెరగకపోవడానికి వారి కుమారుల మధ్య ఉన్న స్నేహమే కారణమని చెబుతున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ లు విష్ణు, మనోజ్ లతో స్నేహంగా ఉంటారట. అర్జున్, మనోజ్ లు క్రిష్ దర్శకత్వంలో కలిసి నటిస్తున్నారు.

ఇటీవల మంజుల కుమార్తె శ్రీదేవి పెళ్ళికి హాజరైన చిరంజీవి అక్కడ తారసపడిన మోహన్ బాబుతో ఆత్మీయంగా మాట్లాడడం అందరి కంటా పడింది. పక్కనే ఉన్న మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్నను చిరంజీవి అభినందించారు. ఆమె నిర్వహిస్తున్న టాక్ షో బాగుందని మెచ్చుకున్నారు. చిరంజీవి, మోహన్ బాబుల మధ్య మళ్ళీ చిగురించిన స్నేహం సినిమా పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి. అనవసరంగా ద్వేషాలు పెంచుకోకుండా పెద్ద మనసుతో వ్యవహరించాలన్న నీతి ఇందులో ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X