రెంటికి చెడ్డ రేవడి చిరు!

ప్రజారాజ్యం నుంచి వలసలు ఆగడం లేదు. చివరికి చిరంజీవి ఒక్కరే మిగులుతారన్న వ్యాఖ్యలు బాగా వినిపిస్తున్నాయి. కానీ తాను మరో రౌండ్ ప్రజల్లోకి వెళ్తే సీన్ మారిపోతుందని చిరంజీవి అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీకి సైద్ధాంతిక పునాదులు వేసినవారు ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. వారు చెప్పిన మాటలనే చిరంజీవి చిలుకలా వల్లె వేస్తున్నారు. సినిమా స్టైల్ రాజకీయాల్లో పనిచేయదని ఎంతో మంది ప్రజారాజ్యం నాయకులు చెప్పి వెళ్ళిపోయారు. పవన్ కల్యాణ్,నాగబాబు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంత బాధలోనూ చిరంజీవి పార్టీ కార్యక్రమాలను ఒంటి చేత్తో నడిపిస్తున్నారు.
ఇప్పుడు చిరంజీవి ప్రజల్లోకి వెళితే మంచి స్పందన రావచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వర్షాలు పడక వ్యవసాయ పనులు ఆగిపోయాయి. ఈ సందర్భం చిరంజీవికి బాగా ఉపయోగపడవచ్చు. కానీ ఎన్నికలు లేకుండా జనంలోకి వెళ్ళడం నీళ్ళు లేని చెరువులో ఈదిన చందం. చిరంజీవి ఇప్పుడు చేయాల్సింది ప్రజల్లోకి వెళ్ళడం కాదు,పార్టీని సంస్ధాగతంగా పునర్ నిర్మించుకోవడం. ఇందుకోసం ఆయన ఎ












Click it and Unblock the Notifications