జగన్ పై మంత్రాంగం

Sonia Gandhi
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని మొదలైన వేడి క్రమక్రమంగా తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మొదట్లో తిరుగుబాటు చేస్తామన్నట్లు మాట్లాడిన మంత్రులు కూడా ఇప్పుడు పార్టీ అధిష్ఠాన వర్గం నిర్ణయమే శిరోధార్యం అనే స్థితికి వస్తోంది. కాంగ్రెసు అధిష్ఠాన వర్గం కోరుకుంటోంది కూడా ఇదే కావడం విశేషం. జగన్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ మాత్రం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డిపై ఎంతగా అభిమానం, సానుభూతి ఉన్నప్పటికీ కోరి కోరి కుంపటి పెట్టుకోవడం ఆమెకు ఇష్టం లేనట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠాన వర్గం పెద్దలు కెవిపి రామచందర్ రావుతో స్పష్టంగా చెప్పారని అంటున్నారు. జగన్ ను మినహా రామచందర్ రావు సూచించే ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడానికి సిద్ధమేనని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. రామచందర్ రావు ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా అంగీకారమేనని వారు చెప్పినట్లు తెలుస్తోంది.

దాదాపు ఆరు నెలల పాటు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా తమకేమీ అభ్యంతరం లేదని, గడువులోగా పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించి, ఆ ఉప ఎన్నికలో రాజశేఖర రెడ్డి సతీమణి గానీ కూతురు గానీ పోటీ చేసేలా చర్యలు తీసుకుంటామని, వారిలో ఎవరికైనా ముఖ్యమంత్రి పదవిని అప్పుడు ఇస్తామని, జగన్ ను మాత్రం అంగీకరంచబోమని చెప్పినట్లు సమాచారం. జగన్ ముఖ్యమంత్రి కావాలనే భావోద్వేగం సమసిపోయిన తర్వాత అసలు విషయాన్ని బయట పెట్టాలని సోనియా తన కోటరీలోని నాయకులకు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతానికి పాలనా యంత్రాంగం కుంటుపడకుండా చూసుకుంటే చాలునని అన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రోశయ్యను ముఖ్యమంత్రిగా కొనసాగించాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీ వ్యవహారాల కోసమైతే రోశయ్య పనికి రారని, ఆ ఆలోచన చేయడానికి కొంత సమయం తీసుకోవచ్చునని భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం జగన్ అనుకూల వర్గం వ్యవహరించిన తీరు వల్ల సోనియా గాంధీ జగన్ కు పూర్తి వ్యతిరేకంగా మారినట్లు చెబుతున్నారు. అయితే, జగన్ ను పూర్తిగా దూరం చేసుకోవాలనే ఆలోచనలో కూడా ఆమె లేనట్లు తెలుస్తోంది. తమ ఆలోచనలకు అనుగుణంగా ఆయన నడుచుకోవాల్సిందేనని చెబుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే జగన్ వేడి చాలా వరకు చల్లారింది. మంగళవారం కెవిపి రామచందర్ రావు నివాసంలో జరిగిన సమావేశానికి 13 మంది మంత్రులు, ఎమ్మెల్సీలు మాత్రమే హాజరయ్యారు. ఇంతకు ముందు జగన్ కు అనుకూలంగా గళమెత్తిన కొంత మంది మంత్రులు, శాసనసభ్యులు ఇప్పటికే తప్పుకున్నారు. జగన్ వెంట ఉన్న మంత్రుల మాటల్లో కూడా వేడి తగ్గింది. సోనియా గాంధీ నిర్ణయమే శిరోధార్యమనే వర్గం పెరుగుతూ వస్తోంది. సోనియా గాంధీ ఆశిస్తున్నది కూడా అదే. మొత్తం ఆమె అనుకున్నట్లే జరుగుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+