హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలకృష్ణ డమ్మీయేనా?

By Staff
|
Google Oneindia TeluguNews

Balakrishna
హైదరాబాద్: బావ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కు తన కుమార్తె బ్రహ్మణిని ఇచ్చిన పాపానికి బాలయ్య బాబు ఇప్పుడు బోరు మనాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఇక్కడేమీ దాంపత్య విషయాల్లో దారుణాలు జరుగలేదు, కానీ రాజకీయం అనుబంధాలను మళ్ళీ దెబ్బ తీస్తోంది. బావ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో బాలకృష్ణ ఊళ్ళు పట్టుకుని ఎండల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. బాలకృష్ణను ప్రచారానికి మాత్రమే పరిమితం చేయాలని, అంతకంటే ఎక్కువ సీన్ ఇస్తే, తనకు సినిమా ఉండదని చంద్రబాబు నాయుడు గ్రహించారు. అందువల్ల బామ్మర్దిని బతిమాలుకుని "నువ్వు ఎన్నికలయ్యేంత వరకు రోడ్ల మీదే ఉండు, నాకోసం కాకపోయినా నీ కూతురి కోసం" అన్నట్టు చంద్రబాబు కన్విన్స్ చేసినట్టు అంతర్గత వర్గాల కథనం. బాలయ్యకు ఎక్కడి నుంచి కూడా టికెట్ ఇవ్వరని తెలుస్తోంది. అయినా బాలకృష్ణ రోడ్ షోలు చేయక తప్పదు. సినిమాల్లో లాగా ఆవేశపడితే కూతురు కాపురానికే ఎసరు వస్తుందేమోనన్న భయం.

ఇంతలో చంద్రబాబుతో మొహమాటం లేకుండా షరతులు పెట్టి రంగంలోకి దిగిన జూనియర్ ఎన్టీఆర్ దుమ్మురేపుతున్నాడు. ఆయన మొదటి రెండు రోజుల రోడ్ షోలు సూపర్ హిట్ అయ్యాయి. బాబాయి బాలయ్య కంటే ఆయన రోడ్ షోలకు జనం విరగబడుతున్నారు. బాబాయికి ఈ విషయంలో బాధ ఉన్నా ఎవరు ప్రచారం చేస్తేనేం బావ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నది "త్యాగ" రాజైన బాలకృష్ణ ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే ఈ తంత్రాలు, మర్మాలు గ్రహించబట్టేనేమో బాలకృష్ణ మనస్ఫూర్తిగా ప్రసంగించలేకపోతున్నారు. ఆయన గొంతుకు అడ్డుపడుతున్నదెవరై ఉంటారు? ఎన్టీఆర్ ఆత్మా? కాదేమో! ఎందుకంటే వైస్రాయ్ డ్రామాలో బాలకృష్ణ పాలు పంచుకోలేదు. ఆనాడు ఆయనది ప్రేక్షక పాత్రే. ఆనాటి పాపంలో బాలయ్య పాపం పెద్దగా లేకపోయినా ఇప్పుడు చంద్రబాబు కోసం రోడ్లు పట్టుకుని తిరుగుతున్న బాలకృష్ణ మీద పై లోకాలలో ఉన్న ఎన్టీఆర్ ధర్మాగ్రహం వ్యక్తం చేయడం సహజమే కదా? ఆత్మీయతలను, ఆత్మలను నమ్మే భారతీయులకు ఇది కూడా నమ్మదగిన విషయమే కదా.

అసలు విషయమేమిటంటే...ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారా అన్నది. ఎవరి నోట విన్నా ఇదే ప్రశ్న. మహాకూటమి ఏర్పడినా, మందకృష్ణ కలిసినా చంద్రబాబు అలయెన్స్ ఎంతవరకు విజయవంతమవుతుందో చెప్పలేం. వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద గ్రామాల స్ధాయిలో పెద్ద వ్యతిరేకత కన్పించడం లేదు. ఈ ఐదేళ్ళు వర్షాలు బాగా పడడంతో జనం పొలం పనుల్లో బిజీగా ఉండి రాజకీయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. వైఎస్ ప్రభుత్వం ఆర్భాటంగా నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టినా రైతు నోటికి నీరు అందుతున్న దాఖలాలు చాలా తక్కువ. అయితే వైఎస్ మరో మారు సిఎం అయితే నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవుతాయన్న ఆశ కూడా గ్రామీణుల్లో ఉంది. ఇటు కాంగ్రెస్ మీద వ్యతిరేకత లేదు, అటు మహాకూటమిని తక్కువగా అంచనా చేయడానికి వీల్లేదు. ఈ రెండు ప్రధాన పార్టీలు సమానంగా సీట్లు గెలుచుకుంటే తన పాతికో, ముప్పయ్యో సీట్లతో చిరంజీవి కీలకపాత్ర పోషించే అవకాశమూ లేకపోలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X