కాంగ్రెస్ కు అనుకూలంగా చిరు?

Chiranjeevi
హైదరాబాద్‌: చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నారా? రానున్న ఐదేళ్ల కాలంలో పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీతో కలిసి ఉండాలని ప్రజారాజ్యం అనధికారంగా నిర్ణయించుకుంది. స్వయంగా.. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి వైఖరి, మనోభావాలు కూడా దానికి తగ్గట్లుగా ఉండటంతో ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వానికి దగ్గరవుతున్నారు. ఐదేళ్లలో తమ నియోజకవర్గాల్లో పనులు కావాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదని మెజారిటీ ఎమ్మె ల్యేలు మానసికంగా నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా ప్రభు త్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే విధంగా ప్రవర్తించక పోగా..అనుకూలంగా ఉండటంతో ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి దగ్గరగా ఉంటే ఎన్నికల్లో పెట్టిన ఖర్చు వీలైనంత తొందరగా తిరిగి సంపాదించుకోవచ్చని భావిస్తున్నారు. దేవేందర్‌ గౌడ్‌ తనను కలిసిన సందర్భంలో చిరు టిడిపిని తప్ప కాంగ్రెస్‌ను పల్లెత్తు మాట అనలేదు. పైగా 'కాంగ్రెస్‌ అంటే మీకెందుకు అంత కోపం" అంటూ కాంగ్రెస్‌ తరఫున వకాల్తా పుచ్చుకునే విధంగా వ్యాఖ్యానించినట్లు పార్టీవర్గాల్లో ప్రచారం జరుగు తోంది.

గౌడ్‌ వెళ్లిన తర్వాత జరిగిన భేటీలో సైతం 'గౌడ్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లవచ్చుకదా" అని చిరు పార్టీ నేతలవద్ద వ్యాఖ్యానించారు. స్పీకర్‌ ఎన్నిక నుంచి సభలో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి వైఖరిని తప్పుపట్టేవరకూ తీసుకున్న నిర్ణయాలు పరిశీలిస్తే తమ పార్టీ కాంగ్రెస్‌కు దగ్గరకావాలని నిర్ణయించు కున్నట్లు కనిపిస్తోందని ఒక సీనియర్‌ నేత వ్యాఖ్యా నించారు. దేవేందర్‌ గౌడ్‌, పెద్దిరెడ్డి వంటి అగ్రనేత లు కూడా ఈ విధానం నచ్చకనే బయటకు వెళుతు న్నప్పటికీ.. పార్టీ నాయకత్వం మాత్రం కాంగ్రెస్‌ను వ్యతిరేకించనంత వరకూ తమ పార్టీకి వచ్చిన ప్రమాదం ఏమీలేదన్నట్లుగా వ్యవహరిస్తోంది.

అసెంబ్లీలోని చిరంజీవి ఛాంబర్‌లో కూడా ఎక్కు వగా కాంగ్రెస్‌ వారే కనిపిస్తుండటం లాబీల్లో చర్చనీ యాంశంగా మారింది. చిరంజీవి సామాజికవర్గా నికి చెందిన మంత్రి వట్టి వసంత కుమార్‌ తరచూ చిరు ఛాంబర్‌కు రావడం, ఆయనతో పాటు..కాంగ్రెస్‌ ప్రచార ప్రతినిధులు వచ్చి చిరుతో మంత నాలు జరపటం ఈ అనుమానాలకు మరింత బల మిస్తోంది. పీఆర్పీని కాంగ్రెస్‌ వైపు మళ్లించడానికి వసంతకుమార్‌ను పార్టీ నియమించిందన్న ప్రచా రం సాగుతోంది. గతంలో వట్టి నామినేషన్‌ కార్య కమానికి అల్లు అరవింద్‌ హాజరయ్యారు. 'మా వాళ్ల అయోమయాన్ని కాంగ్రెస్‌ బాగా వాడుకుంటోంది. తరచూ వాళ్లు మా బాస్‌ ఛాంబర్‌కు రావడం ద్వారా మా పార్టీ కాంగ్రెస్‌కు దగ్గరవుతోందన్న సంకేతా లను మీడియా ద్వారా పంపడమే కాంగ్రెస్‌ లక్ష్యం" అని ఓ ఎమ్మెల్యే వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+