జయప్రకాశ్ పై కమ్మకుల పెద్దల ఆగ్రహం?

గ్రేటర్ ఎన్నికల్లో ఎంత బలహీన పడినా లోక్ సత్తాకు 5.54 శాతం ఓట్లు వచ్చాయి. సెటిలర్ల ఓట్లను ప్రజారాజ్యం కూడా చీల్చగలిగింది. అయినా తెలుగుదేశం పార్టీకి గత సాధారణ ఎన్నికల కంటే ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది. గత ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో తెలుగుదేశం పార్టీకి 14 శాతం ఓట్లు మాత్రమే రాగా ఈ ఎన్నికల్లో 27.79 శాతం రావడం గమనించాల్సిన విషయం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు టిడిపికి ఓట్లలో వచ్చిన తేడా 0.38 శాతం మాత్రమే.
లోక్ సత్తా అభ్యర్ధులు రంగంలో ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఒక గట్టి అభిప్రాయానికి వచ్చిన కమ్మ పెద్దలు, మేధావులు ఎలాగైనా జయప్రకాష్ నారాయణను ఒప్పించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తాను అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమాత్రం లేకపోగా, గెలుపు గుర్రంలా కనిపిస్తున్న తెలుగుదేశం విజయావకాశాలను లోక్ సత్తా దెబ్బతీయడం చూడడానికి ఏ మాత్రం బాగుండలేదని వీరు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. కావాలంటే, జెపి రాజకీయాల నుంచి తప్పుకుంటానంటే ఆయన సమాజిక సేవా కార్యక్రమాలకు ఎన్ని కోట్ల విరాళాలనైనా సేకరించి ఇస్తామని ఆవేశపరుడైన ఒక కమ్మ వ్యాపారవేత్త వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications