మగధీర పై న్యాయపోరాటం

కానీ చండేరి నవల వివాదం ఇంకా అల్లు అరవింద్ ను, దర్శకుడు రాజమౌళిని వెంటాడుతోంది. ఏడు రోజుల్లోగా తమ క్లయింట్ కు క్షమాపణ చెప్పి, తగిన పరిహారం చెల్లించుకోవాలని ఆ లీగల్ నోటీసులో ఉంది. ఈ లీగల్ నోటీసు కాపీలను దట్స్ తెలుగు డాట్ కామ్ సహా ఆన్ని ప్రధాన పత్రికలకు వెబ్ సైట్లకు నేడు పంపించారు.
చండేరి నవలను ఎన్నో నెలల క్రితం ఎమెస్కో ప్రచురణ సంస్ధ పుస్తకంగా ప్రచురించింది. అంతకు ముందు ఈబనవల ఆంధ్ర భూమి వారపత్రికలో సీరియల్ గా వచ్చింది. రచయిత చారి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఆయన తరఫున విజయ్ కుమార్ అనే న్యాయవాది న్యాయ పోరాటం చేస్తున్నారు. ఏడురోజుల్లోగా సమాధానం ఇవ్వకపోతే ఈ వివాదం న్యాయస్ధానానికి చేరుకుంటుంది. ఆ తర్వాత పరిస్ధితి మగధీర సినిమా ప్రదర్శనను ఆపే వరకు వెళ్ళ వచ్చు.












Click it and Unblock the Notifications