మళ్ళీ వైఎస్ ఏనా?

రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబం ఈ ఐదేళ్ళలో కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నట్టు ఆరోపణలు ఉన్నా కాంగ్రెస్ అధిష్టానవర్గం పట్టించుకున్నట్టు కన్పించడం లేదు. "సాక్షి"లో కొన్ని కంపెనీల బోగస్ పెట్టుబడులు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ కంపెనీల యజమానులకు ప్రభుత్వం ఏవో ఫేవర్లు చేసినట్టు సమాచారం. ఆ కంపెనీల సమాచారాన్ని చంద్రబాబు నాయుడు, ఆయన కమాండ్ లోని ఒక పత్రిక బయట పెట్టాయి.
అయితే చంద్రబాబులా హైటెక్ పోజులు కొట్టకుండా సామాన్య ప్రజలకు దగ్గరగా ఉండడం వైఎస్ కు పెద్ద ప్లస్ పాయింట్. రైతులు చంద్రబాబుకు ఎంత వ్యతిరేకంగా ఉన్నారంటే ఇప్పటికీ ఆయన పరిపాలనలోని చేదును ఊహించలేకపోతున్నారని వివిధ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో తనకు సలహాలు ఇచ్చిన సీనీయర్ ఐఎఎస్ అధికారులను చంద్రబాబు తిట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన చేయగలిగింది పెద్దగా ఉండదు.
మహాకూటమి మీద కులం ప్రభావం బాగా ఉంది. బిజెపి వెంకయ్య నాయుడు కూడా కలిస్తే అది మహా కుల కూటమి అయి ఉండేది. ఒక కులం నీడ పడిన మహా కూటమి అధికారంలోకి వచ్చేటంతటి సీట్లను తెచ్చుకునేంత సీన్ కన్పించడం లేదు. అయితే చిరంజీవి తెచ్చుకునే ఆ ముప్పై నలభై సీట్లను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు, వైఎస్ సిద్ధమవుతున్నారు, అయితే చిరు ఎవరికి మెగా వరం ఇస్తారన్నది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications