రాములమ్మ కోవర్టు?

Vijayashanthi
హైదరాబాద్: మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో కోవర్టా. ఆమెను వ్యూహం ప్రకారం కాంగ్రెసు పార్టీయే తెరాసలోకి ప్రవేశపెట్టినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.తెరాసను పెద్ద మొత్తంగా చీల్చేందుకు కాంగ్రెసు పార్టీ నాయకత్వం ప్రణాళిక రచించి విజయశాంతిని అందుకు నియోగించినట్లు చెబుతున్నారు. మొదటి నుంచీ విజయశాంతి తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావును వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ సాధనే తన ధ్యేయమని చెబుతూనే ఆమె కెసిఆర్ ను దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. నిజానికి, ఆమె సినీ గ్లామర్ తెలంగాణ ప్రజలను కెసిఆర్ కు దూరం చేస్తుందనే ఆశలు పెట్టుకున్నవారు చాలా మందే ఉన్నారని అంటారు. అయితే తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణలో పర్యటించిన ఆమెకు ప్రజల నుంచి అంతంత మాత్రంగానే ఆదరణ లభించింది. దీంతో విసిగిపోయి ఆమె తెరాసలో చేరి పార్టీలో ఎసరు పెట్టేందుకు ప్రయత్నించినట్లు చెబుతున్నారు.

మెదక్ సీటు కోసం పట్టుబట్టడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. తెరాసకు పెట్టని కోట అయిన మెదక్ లో తెరాసను దెబ్బ తీయడంలో భాగంగానే ఆమె ఆ సీటు కోసం పట్టుబడినట్లు చెబుతున్నారు. కెసిఆర్ తనకు ఆ సీటు ఇవ్వకపోతే ఎన్నికలకు ముందే పార్టీని చీల్చుకురావాలనేది ఆమె వ్యూహమట. అయితే కెసిఆర్ ఆ సీటును ఆమె కోసం త్యాగం చేశారు. పైగా హరీష్ రావు వెంట ఉండి ఆమెను గెలిపించారు.

శాసనసభ, లోకసభ స్థానాలకు పోటీ చేసి తెరాస ఉప ఎన్నికలను ఎదుర్కున్న సమయంలో విజయశాంతి పని కట్టుకుని వరంగల్, నల్లగొండ జిల్లాల్లో పర్యటించి తెరాసకు వ్యతిరేకంగా పని చేశారు. కెసిఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. నిజానికి ఆ సమయంలోనే ఆమె కాంగ్రెసు నాయకులతో కుమ్మక్కయినట్లు ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి సన్నిహిత మిత్రుడు కెవిపి రామచందర్ రావు వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని కూడా చాలా మంది చెవులు కొరుక్కున్నారు.

తాజాగా విజయశాంతిని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వెనకేసుకొని రావడం, తెరాస నుంచి కాంగ్రెసులోకి వెళ్లిన నరేంద్ర, తూర్పు జయప్రకాష్ రెడ్డి వంటి నాయకులు విజయశాంతితో సమావేశాలు నిర్వహిస్తుండడం కూడా అనుమానాలకు తావిస్తోంది. అయితే, ఈ ప్రచారం వల్ల కెసిఆర్ కన్నా విజయశాంతికే ఎక్కువ నష్టం జరుగుతుందనేది వేరే విషయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+