సోనియా 'తెలంగానం'?

అనేక కుంభకోణాల్లో వైఎస్ చిక్కుకుని ఉన్నందువల్ల తెలంగాణ గురించి పట్టుబట్టడానికి ఇదే మంచి తరుణమని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వేగంగా పావులు కదుపుతున్నారు. నేడు సోనియాగాంధీతో ప్రత్యేకంగా సమావేశమైన పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను వివరించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందే తెలంగాణ రాష్ట్రం గురించి ప్రకటన చేసి, టీఅర్ ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం మహా కూటమి ప్రభావం తగ్గిపోతుందని అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే సోనియా గాంధీకి చెప్పారు.
ఆంధ్రప్రాంత కాంగ్రెస్ ఎంపీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం పార్టీ శ్రేయస్సుకి మంచిదని చెప్పినట్టు తెలిసింది. నిన్న సోనియాగాంధీని కలిసిన కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీకి ఇదే విషయం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం విషయంలో సోనియాగాంధీ అనుకూలంగా ఉన్నట్టు సాంబశివరావు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రం విషయంలో వైఎస్ ఇప్పటికీ తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటివరకు ఆయనను నమ్ముకుని పూర్తి స్వేచ్చ ఇచ్చిన అధిష్టానవర్గం ఎన్నికల ముందు పునరాలోచనలో పడింది. వైఎస్ ఒంటెద్దు పోకడలు, ఆయన చుట్టూ కమ్ముకున్న కుంభకోణాల నీడలు హై కమాండ్ ను కలవరపరుస్తున్నాయి. ఒక్క వారం రోజుల్లో ఒక స్పష్టమైన రాజకీయ చిత్రం కన్పించే అవకాశాలున్నాయి.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications