హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఏం చేస్తారు?

By Staff
|
Google Oneindia TeluguNews

Jagan
ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెసు పార్టీ అధిష్ఠాన వర్గం నిర్ణయం దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో వైయస్ జగన్ ఏం చేయనున్నారనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలు లేవనే అభిప్రాయం కాంగ్రెసు పార్టీలోనే బలంగా నాటుకుపోతోంది. పార్టీ సీనియర్ నేతలు కె.కేశవరావు, జి.వెంకటస్వామి వంటి వారు మాట్లాడుతున్న తీరు, ముఖ్యమంత్రి కె.రోశయ్య తనను తాను అసెర్ట్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఆ విషయాన్ని కాస్తా స్పష్టంగానే చెబుతున్నాయి. ఈ స్థితిలో జగన్ భవిష్యత్తు కార్యక్రమంపై చర్చ సాగుతోంది. ఆయన ప్రస్తుతం ఇడుపులపాయలో తన కుటుంబ సభ్యులతో పాటు ఉన్నారు. మంత్రులు, శాసనసభ్యులు, కాంగ్రెసు పార్టీ నాయకులు పలువురు ఇడుపుల పాయకు వెళ్లి జగన్ ను పరామర్శిస్తూ ఆయనకు మద్దుతు పలుకుతున్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా తరలి వస్తున్నారు. జగన్ ఈ నెల 25వ తేదీన వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం జరిగిన పావురాల గుట్టను సందర్శించి హైదరాబాదుకు వస్తారని అంటున్నారు.

హైదరాబాదుకు వచ్చిన తర్వాత ఆయన తన భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటారని తెలుస్తోంది. తనను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయకపోతే జగన్ ఏం చేస్తారు, ఆయనకు మద్దతిస్తున్న లాబీ ఏం చేస్తుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ వస్తూనే ఉంది. జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఆయన లాబీకి చెందిన నాయకులు కొంత మంది సీనియర్ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యమంత్రి వ్యవహారంపై గత రెండు, మూడు రోజులుగా మాట్లాడుతున్న సీనియర్ నేత రోశయ్యపై పార్టీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పార్టీ అధిష్ఠాన వర్గం ఆదేశాలు కేశవరావుకు కూడా వర్తిస్తాయని ఆయన అన్నారు. పుండుపై కారం చల్లే విధంగా కేశవరావు మాట్లాడుతున్నారని ఆయన మంగళవారం విరుచుకుపడ్డారు. పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బ తీసేలా కెకె మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇలా జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తున్న నాయకులు ఆగ్రహంగానే ఉన్నారు. లోలోపల మసలిపోతున్నట్లు కూడా కనిపిస్తోంది.

అయితే, జగన్ మూడు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు ముగిసే వరకు ఆగకపోవచ్చుననే మాట వినిపిస్తోంది. ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమానికి దిగవచ్చునని అంటున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి కలత చెందిన ప్రజలను, హఠాన్మరణం చెందిన కుటుంబాలను కలుసుకునే ఉద్దేశంతో ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజామద్దతును కూడగట్టి అధిష్ఠాన వర్గానికి తన ప్రజాబలమేమిటో నిరూపించే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. అదే సమయంలో మరింతగా పార్టీ నేతల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం కూడా ఆయన చేయవచ్చునని అంటున్నారు. జగన్ భవిష్యత్తు కార్యక్రమంపై పార్టీ అధిష్ఠాన వర్గం ఒక అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వినికిడి. ఏమైనా ఇది జగన్ కే కాకుండా కాంగ్రెసు పార్టీకి కూడా పరీక్షా కాలమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X