వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి చాలా నేర్చుకోవాలి!

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ఏది ఏమైనా ఎన్ని కొత్త గాలులు వీచినా అనుభవం అనుభవమే. రాజకీయంగా ముఖ్యపదవుల్లో ఎంతో అనుభవం చంద్రబాబుకు ఉంది. వైయస్ కూ ఉండేది. రోశయ్య లాంటి వాళ్ళు వీరిద్దరి కంటే ఇంకా సీనియర్లు అయినా ఆనుభవంలో తేడాలు ఉన్నాయి. ఎంపీగా ఉన్నప్పుడు కూడా వైయస్ రాష్ట్రమంతటా తన నెట్ వర్క్ ను విస్తరించుకున్నారు. ప్రతి మండలంలోనూ తన మనుషులను తాను స్వయంగా గుర్తు పట్టగలిగే మెమరి పవర్ ను పెంచుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి, ఆ తర్వాత ఆ పదవిలో గట్టిపడడానికి, మరణించిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోడానికి ఆ పబ్లిక్ రిలేషన్స్ ఎంతగానో పనికొచ్చాయి.

చంద్రబాబు నాయుడికి కూడా అంతే మెమరీ పవర్ ఉంది. ఏ గ్రామంలో ఏ నాయకుడు రెండు వందల ఓట్లు తేగలడో కూడా ఆయనకు కొన్ని జిల్లాల్లో అవగాహన ఉంది. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేలే ఒక 500 మంది వరకు ఉంటారు. వారి కులగోత్రాలు, వ్యవహార శైలి ఆయనకు బాగా తెలుసు. క్యాడర్ ను చూసినప్పుడు వైయస్ లో ఆ మానవత్వపు అంశ తొణికిసలాడేది. చంద్రబాబులో ఒక యాంత్రికత కన్పిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ప్రజాధనాన్ని దోచుకున్నారన్నది ఇక్కడ అప్రస్తుతం.

చిరంజీవి ఈ విషయంలోనే మైనస్ మార్కులు వస్తున్నాయి. ఆయన తన పార్టీ నియోజకవర్గ స్ధాయి నాయకులను గుర్తుపట్టుకోవడంలో చాలా పూర్. ఆయన సినిమా ఫక్కీలో వ్యవహరించడం వల్లనే ఇల్లా జరుగుతోంది. ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో కాస్త వెనుకబడి ఉండేవారు. అయినా ఎవరైనా చిన్న హింట్ ఇస్తే ఎంత చిన్న నాయకుడినైనా ఆయన పేరుతో మర్యాదగా నోరారా పిలిచేవారు. చిరంజీవి కూడా లా తయారైతే తప్ప వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే గోచి వరకు వచ్చిన ప్రజారాజ్యం నుంచి ఆ చిన్న వస్త్రాన్ని కూడా లాగేసుకోడానికి నియోజకవర్గాల వారీగా వ్యూహాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశం లోకి వలసలు గణనీయంగా ఉన్నాయి. ఈ ముప్పును ఎదుర్కోవాలంటే చిరంజీవి ఇమేజి చట్రం నుంచి బయటపడి ప్రజా నాయకుడిలా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X