విభజన వల్ల జగన్ కు మేలు?

YS Jagan
రాష్ట్ర విభజన జరిగితే లాభపడే రాజకీయ నాయకులు ఎవరనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఆ మేరకు అంచనాలు కూడా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇరు ప్రాంతాల్లో కాంగ్రెసు పరిస్థితి ఏమిటనే అంచనాలతో పాటు ఏయే నాయకులు ఏ మేరకు లాభపడతారు, ఏ మేరకు నష్టపోతారనే అంచనాలు కూడా సాగుతున్నాయి. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో ఎక్కువగా కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ లాభపడతారని అంటున్నారు. సొంత పార్టీ పెడితే వైయస్ జగన్ తిరుగులేని నాయకుడిగా సీమాంధ్రలో ముందుకు వస్తారని, ఆ మేరకు కాంగ్రెసు పార్టీ నష్టపోతుందని అంటున్నారు. వైయస్ జగన్ కాంగ్రెసులో ఉంటే కాంగ్రెసు లాభపడుతుందని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రతిష్ట పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పోట్టి శ్రీరాములు తరహాలో కెసిఆర్ చరిత్రలో నిలిచిపోతారని అంటున్నారు. తెలంగాణ ఏర్పడితే కాంగ్రెసు ఈ ప్రాంతంలో తిరుగులేని బలాన్ని సంపాదించుకుంటుందని, సీమాంధ్రలో, హైదరాబాదులో మాత్రం నష్టపోతుందని అంటున్నారు. అందుకే తెంలగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ జాప్యం చేస్తున్నారని చెబుతున్నారు.

తెలంగాణలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని, సీమాంధ్రలో మాత్రం కాంగ్రెసుకు జరిగే నష్టం మేరకు లాభపడుతుందని అంచనాలు వేస్తున్నారు. సీమాంధ్రలో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి విశేష ప్రజాదరణ లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. కాపుల జనాభా కూడా ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండడంతో చిరంజీవికి జనాదరణ పెరుగుతుందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+