విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దానికి పవన్ కళ్యాణే కారణమా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
విజయవాడకు చెందిన ప్రజారాజ్యం పార్టీ ఉపాధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ ప్రాబల్యం తగ్గడానికి చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ కారణమనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వంగవీటి రాధ చిరంజీవి కన్నా పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడని, పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాలకు దూరం కావడంతో రాధా ప్రాబల్యం తగ్గుతూ వచ్చిందని అంటున్నారు. ఎన్నికల్లో పార్టీ తగిన ఫలితాలు సాధించుకపోవడం, కాంగ్రెసుకు పార్టీ సన్నిహతం కావడం వంటి కారణాల వల్ల పవన్ కళ్యాణ్ పార్టీకి దూరమైనట్లు చెబుతున్నారు. యువరాజ్యం అధ్యక్షుడిగా పార్టీకి ఓ ఊపునిచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పూర్తిగా తన సమయాన్ని సినిమాలకే కేటాయిస్తున్నారు. పార్టీలో పవన్ కళ్యాణ్ చురుగ్గా పాల్గొంటారని అల్లు అరవింద్, నాగబాబు వంటివారు చెప్పిన ఆ సూచనలు కనిపించడం లేదు.

చిరంజీవి పార్టీ పెట్టే సమయంలో తొలుత రాధా పవన్ కళ్యాణ్ ను కలిశారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకే ఆయన పార్టీలోకి వచ్చినట్లు చెబుతారు. ఈ స్థితిలో రాధా ప్రాబల్యం పార్టీలో తగ్గడమే కాకుండా తాను మద్దతిచ్చిన శాసనసభ్యుడు శ్రీనివాస రావు ఆయకు దూరమయ్యారు. విజయవాడ పార్టీలో తనను కాదని శ్రీనివాస రావును చిరంజీవి ప్రోత్సహించడాన్ని రాధా జీర్ణించుకోలేకపోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రభల కార్యక్రమానికి చిరంజీవి గైర్హాజరు కావడం వెనక కారణం అదేనని అంటున్నారు.

అదే సమయంలో చిరంజీవి తన కూలాన్ని పూర్తిగా సొంతం చేసుకునే స్థితిలో లేరు. కాపు కులానికి మాత్రమే తాను ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తే పార్టీపై ఆ ముద్ర పడుతుందని, అది నష్టం చేస్తుందని చిరంజవి భావిస్తున్నట్లు సమాచారం. రాధ తండ్రి వంగవీటి రంగాపై నిర్మించ తలపెట్టిన సినిమాల్లో నటించడానికి చిరంజీవి నిరాకరించడం వెనక కూడా అదే కారణం ఉందని అంటారు. తాను ఒక కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు కనిపించకూడదని ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది. దీంతో కాపు కులానికి చెందిన నాయకులు పలువురు చిరంజీవికి దూరమవుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X