వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి ఎన్టీఆర్ అంత భవిష్యత్తు ఉందా?

By Santaram
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ఏనాటికైనా చిరంజీవి సీనియర్ ఎన్టీఆర్ అంతటివాడు రాజకీయాల్లో అవుతారా? ఎన్టీఆర్ రాజకీయాల్లో సింహబలుడిగా ఉండేవారు. కొందరు మేధావుల మాటలు మినహా ఎవరినీ ఖాతరు చేసేవారు కాదు. ఆయన రాజకీయ గ్రంధాలు పెద్దగా చదువుకోకపోయినా కామన్ సెన్స్ తో అనేక సంవత్సరాల పాటు రాజకీయాలను విజయవంతంగా నడిపించారు. ప్రజలు తనను ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఆయన దైర్యం కోల్పోకుండా, టైమ్ మేనేజ్ మెంట్ లో భాగంగా సినిమాల్లో నటించారు. 1994 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీకి సీట్ల పండుగ పండించి కాంగ్రెస్ ను మట్టి కరిపించారు.

మరి చిరంజీవికి అంత ఉందా? ఈ మధ్య ఆయన ఒళ్ళు తగ్గించికున్నట్టు కన్పిస్తోంది. అది సినిమాల కోసమా, ఎండల్లో జనం మధ్య తిరగడం కోసమా అన్నది ఆలోచించాల్సిన విషయం. 2014 ఎన్నికల్లో అయినా చిరంజీవి ముఖ్యమంత్రి కాగలరా? ఎన్టీఆర్ లో ఉన్న ఆవేశం, సేవా దృక్పధం చిరంజీవిలో అంత ఎక్కువగా కన్పించవు. రాజశేఖరరెడ్డిలో ఉన్న డైనమిజం కానీ, ఎన్టీఆర్ లో ఉన్న ఆకర్షణశక్తి కానీ ఆయనలో లేవు. బావమరిది అల్లు అరవింద్ ఎలా చెబితే అలా నడుచుకోవడం తప్ప సొంత నిర్ణయాలు తీసుకునేశక్తి ఆయనలో తక్కువ.

అయితే వచ్చే ఎన్నికలలో ఘన విజయం సాధించడానికి ఆయన ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించుకుంటున్నట్టు కన్పిస్తోంది. రాజశేఖరరెడ్డి లేని లేటును తన ద్వారా పూర్తి చేయించుకుని, ప్రజారాజ్యం పార్టీని సీమాంధ్రలో గెలిపించడానికి ఆయన ప్రయత్నించే అవకాశముంది. ఈ టార్గెట్ ముందు అల్లు అరవింద్ ను రాజ్యసభ సభ్యుడిని చేసుకోవడం చిన్న టార్గెటే కావచ్చు.

ఒక నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ అంటే చిరంజీవికి గొప్ప అభిమానం. చిరంజీవి పెద్ద అందగాడు కాకపోయినా హీరోగా రాణించడం ఎన్టీఆర్ కు నచ్చిన విషయం. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చిరంజీవిని బ్రేక్ ఫాస్ట్ కు రప్పించుకుని ప్రేమగా మాట్లాడడం వెనుక ఇద్దరి గొప్పతనం ఉంది. మారిన రాజకీయ సామాజిక, రాజకీయ పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని చిరంజీవి ఎన్టీఆర్ లాగా మొండిగా పోరాడడం మంచిదేమో.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X