తెలంగాణకు అనుకూలమా?

Kiran Kumar Reddy
ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేయడం తెలంగాణకు అనుకూలమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డి పుట్టి పెరిగింది, చదివింది హైదరాబాదులోనే. ఆయన రాజకీయంగా మాత్రమే రాయలసీమకు చెందినవారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అంత మాత్రాన అది తెలంగాణకు అనుకూలంగా మారిపోతుందా అనేది ప్రశ్న. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చేలోగా తెలంగాణకు అనుకూలమైన ఏర్పాట్లు చేసుకోవాలనే ఆలోచనలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు. తెలంగాణకు చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిగా వేస్తే తెలంగాణకు తాము వ్యతిరేకంగా ఉన్నామనే సంకేతాలు వెళ్తాయనే భావనకు అధిష్టానం గురైనట్లు చెబుతున్నారు. తెలంగాణకు చెందిన జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవికి ఒప్పించడం ద్వారా తెలంగాణ వ్యతిరేక కార్యకలాపాలను పెంచాలనే ఆలోచనలో ఉన్న సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి నియామకం పెద్ద దెబ్బ అని అనుకుంటున్నారు. తమకు అత్యంత విధేయుడైన కిరణ్ కుమార్ రెడ్డి వల్ల తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు అడ్డంకులుండవని భావించినట్లు చెబుతున్నారు.

తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దాన్ని బట్టి తెలంగాణ విషయంలో ఆయన వివాదాల్లోకి వెళ్లదలుచుకోలేదని తెలుస్తోంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రకు చెందినవాడిగా ఆ ప్రాంతంలో ఆందోళనలు చెలరేగితే కట్టడి చేయగల సత్తా కిరణ్ కుమార్ రెడ్డికి ఉంటుందని అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఎస్సై రాత పరీక్షల వాయిదా ద్వారా అధిష్టానం రోశయ్య సత్తాను ప్రయోగానికి పెట్టినట్లు సమాచారం. పరీక్షలు వాయిదా వేయాలనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. వాయిదాలో రోశయ్య ప్రమేయం లేదు. పరీక్షలను వాయిదా వేసిన వెంటనే సీమాంధ్రలో ఆందోళనలు చెలరేగాయి. ఆ ఆందోళనలను అదుపు చేయడంలో రోశయ్య విఫలమయ్యారు. దాంతో ముఖ్యమంత్రిని మార్చాలనే గట్టి నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది.

తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు ముఖ్యమంత్రిని ఖరారు చేసినట్లవుతుందని చెబుతున్నారు. అయితే, బొత్స సత్యనారాయణను పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే మాత్రం అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా పావులు కదుపుతుందని గట్టిగా నమ్మవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బొత్స సత్యనారాయణ అనుకూలంగా ఉన్నారు. దానివల్ల ఆ అభిప్రాయానికి బలం చేకూరుతుంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తే, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ కాంగ్రెసుకు లభిస్తుంది. సీమాంధ్రలో కూడా కాంగ్రెసుకే మెజారిటీ ఉంటుంది. సీమాంధ్రలో చిరంజీవి మద్దతు తీసుకోవడానికి కూడా వీలవుతుంది. గీతారెడ్డిని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తే ఆమెను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తే దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామనే తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కోరిక కూడా నెరవేర్చినట్లవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+