ఢిల్లీ సుల్తానుల ముందు ఓడిపోతున్న కెసిఆర్

ఎన్ని అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత అలవాట్ల మీద విమర్శలు ఉన్నా ఆయన మొక్కవోని విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. ఢిల్లీ సుల్తానులకు తానేమిటో నిరూపించారు. తర్వాత జరగవలసిందేమిటో అన్న ఉత్కంఠ తెలంగాణ ప్రజల్లో ఉంది. శ్రీకృష్ణ కమిటీని తెలంగాణ వాదులు విశ్వసించడం లేదు. సాధారణంగా ఇటువంటి కమిటీలు రిటైరైన వారికి ఉపాధిగా పనిచేస్తాయి. కొన్ని వందల మంది నుంచి కొన్ని వేల పేజీల అర్జీలను తీసుకున్న శ్రీకృష్ణ కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం. పై నుంచి ఏ ఆదేశాలు ఉన్నాయో తెలియదు.
ఇప్పుడు చంద్రశేఖరరావు అతిశయానికి పోకుండా మరింత యుక్తిగా వ్యవహరించాలి. తన అభ్యర్ధుల విజయానికి కారకులైన అన్ని సంఘాలకు ఆయన అందుబాటులో ఉండాలి. ఇది టిఆర్ ఎస్ విజయం అనుకోకుండా తెలంగాణ విజయమని తెలుసుకోవాలి. దొర మనస్తత్వాన్ని విడనాడాలి.












Click it and Unblock the Notifications