కెసిఆర్ కొత్త కుంపటి

K Chandrasekhar Rao
కోరి కోరి వివాదాల్లో చిక్కుకోవడం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు పరిపాటి. అలాగే మరోసారి ఆయన వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణలో పుట్టి పెరిగినవారంతా స్థానికులేనని కెసిఆర్ చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపింది. తెలంగాణ ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణవాదులు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. కెసిఆర్ కు అన్ని విధాలా అండదండలు అందిస్తున్న తెలంగాణ రాజకీయ జెఎసి నేత కోదండరామ్ ఇరకాటంలో పడ్డారు. దానికి తోడు కెసిఆర్ కు పక్కా సమైక్యవాది అయిన కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మద్దతు పలుకుతున్నారు. లగడపాటి రాజగోపాల్ ను కెసిఆర్ ప్రశంసించారు. ఇదంతా కెసిఆర్ కు తెలంగాణలో వ్యతిరేక పరిస్థితిని కల్పించి పెట్టింది.

నిజానికి, కెసిఆర్ మాటల్లో ఏ విధమైన తప్పూ కనిపించదు. కానీ, లోతుల్లోకి వెళ్లి చూస్తే అది కెసిఆర్ మాటల్లోని తప్పు ఏమిటో అర్థమవుతుందని తెలంగాణవాదులు అంటున్నారు. ముల్కీ నిబంధనలను తుంగలో తొక్కి, వివిధ ఒప్పందాలను ఉల్లంఘించి పలు రకాల్లో దొడ్డి దారుల్లో వచ్చి తెలంగాణలో ఉద్యోగాలు సంపాదించి ఇక్కడ స్థిరపడిపోయారు. వారికి పుట్టి పెరిగిన పిల్లలు పెద్దవారయ్యారు. ఈ పిల్లలను స్థానికులుగా గుర్తిస్తే తెలంగాణ స్థానికులకు అన్యాయం జరుగుతుందని, అక్రమాలను సక్రమం చేసినట్టవుతుందని తెలంగాణ ప్రజా సంఘాల అభిప్రాయం. పాత ఉల్లంఘనలను తిరిగిదోడి, విచారణ జరిపించి స్థానికేతరులుగా గుర్తించాలని, వారిని స్థానికేతరులుగానే పరిగణించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.

తెలంగాణ న్యాయవాదుల జెఎసి వాదనతో విభేదిస్తూ కెసిఆర్ ఆ ప్రకటన చేశారు. కెసిఆర్ తన ప్రకటన ద్వారా ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారనేది వారి అభియోగంగా కనిపిస్తోంది. కెసిఆర్ ప్రకటనపై కోదండరామ్ తీవ్ర ఇరకాటంలో పడ్డారు. కెసిఆర్ ను వ్యతిరేకించలేక, సమర్థించనూ లేక ఆయన ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం జరిగిన తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. దానిపై కెసిఆర్ వివరణ అడుగుతానని ఆయన చెప్పారు. అయితే, కెసిఆర్ ప్రటనతో నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తమ్మీద కెసిఆర్ మరో కొత్త కుంపటి నెత్తికెత్తుకున్నారు. దీన్ని ఆయన ఏ విధంగా పరిష్కరించుకుంటారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+