బాబుపై కెసిఆర్ సైకలాజికల్ వార్

ఇదే సమయంలో చంద్రబాబు వైఖరిని కెసిఆర్ తీవ్రంగా తప్పు పడుతున్నారు. తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్లన్న చంద్రబాబుపై ప్రజలు మూడో కన్ను తెరిచారని విరుచుకు పడుతున్నారు. బాబ్లీపై పోరాటానికి నాయకులందరినీ నడిపించిన చంద్రబాబు ఆర్డీఎస్ కు ఎందుకు తీసుకుని వెళ్లడం లేదని అంటున్నారు. అంతేకాకుండా, తెలంగాణ జిల్లాల నుంచి ప్రతి రోజూ తెలుగుదేశం కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తెరాసలో చేరుతున్న వైనానికి కెసిఆర్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ప్రచారానికి తెలంగాణ గుండె చప్పుడు రాజ్ న్యూస్ ను అత్యంత ప్రతిభావంతంగా ఆయన వాడుకుంటున్నారు. రాజ్ న్యూస్ కెసిఆర్ కు ఒక ఆయుధంగా పనిచేస్తోంది.
తెలుగుదేశం తెలంగాణ నాయకులు తనను సంప్రదిస్తున్నారని చెప్పి కెసిఆర్ చంద్రబాబుకు నాయకులపై అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్గత సమావేశాల్లో తెలంగాణపై మాట్లాడుతున్న నాయకులపై చంద్రబాబుకు అనుమానాలు రేకెత్తే పరిస్థితి ఏర్పడింది. దీంతో తెలుగుదేశం తెలంగాణ నాయకులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. చంద్రబాబు ఆగ్రహం ఎప్పుడు ఎవరి మీద వ్యక్తమవుతుందో తెలియని పరిస్థితి. ఈ స్థితిలో నాగం జనార్దన్ రెడ్డి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నట్లు అర్థమవుతోంది. తమ పార్టీ నాయకులు ఎవరూ తెరాసలో చేరరని, తాను పార్టీలోనే ఉండి తెలంగాణపై పోరాటం చేస్తానని నాగం జనార్దన్ రెడ్డి వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.
కెసిఆర్ దాడికి చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. దీంతో తెలంగాణ జిల్లాల నాయకుల సమావేశాలు ఏర్పాటు చేసి వారికి నైతిక ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా అంతగా ఫలితం రావడం లేదు. కెసిఆర్ ను ఎదుర్కోవడానికి కొద్ది మంది తప్ప ఆశించిన స్థాయిలో నాయకులు ముందుకు రావడం లేదు. తాము ఒక్క మాట అంటే కెసిఆర్, తెరాస నాయకులు నాలుగు మాటలంటున్నారు. వాటికి సమాధానాలు ఇవ్వడం తెలుగుదేశం తెలంగాణ నాయకుల తరం కావడం లేదు. దాంతో కెసిఆర్ తమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, కాంగ్రెసును ఎందుకు చేయడం లేదని చంద్రబాబు అడుగుతున్నారు. వ్యూహాత్మకంగానే కెసిఆర్ చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారనేది అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీని నైతికంగా దెబ్బ తీస్తే కాంగ్రెసుతో నేరుగా తెరాసకు పోటీ ఉంటుంది. ఆ తర్వాత కాంగ్రెసుపై నైతిక యుద్ధం ప్రకటించడం కెసిఆర్ కు సులభం అవుతుందనేది కెసిఆర్ ఎత్తుగడ కావచ్చు.












Click it and Unblock the Notifications