లక్ష్మణ్ ఆడితే గెలుపు, సచిన్ ఆడితే...?

సచిన్ టెండూల్క్రర్ వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడుతాడని పలు సందర్భాల్లో వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే. అతనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం కొత్త కాదు. కానీ లక్ష్మణ్ బ్యాటింగ్ ఒక సంగీత ఝరిలాంటిది. సాంకేతికంగా లక్ష్మణ్ ను మించిన బ్యాట్స్ మన్ లేడని చెప్పవచ్చు. మణికట్టు మాయాజాలం అతనిది. చెప్పాలంటే, సచిన్ టెండూల్కర్ మాస్, లక్ష్మణ్ క్లాస్.. డర్బన్‌లో సఫారీలకు విజయాన్ని దూరం చేసిన వీవీఎస్ లక్ష్మణ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం గ్రేమ్ పోలాక్. ''లక్ష్మణ్‌ను ఏ ఇతర క్రికెటర్‌తోనూ పోల్చలేం. అతడు ఎప్పుడూ మైదానంలో సహనాన్ని కోల్పోవడం చూడలేదు. తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడు. ఇప్పటికైతే అతడిని వేరొకరితో పోల్చలేం. బహుశా భవిష్యత్తులో లక్ష్మణ్ లాంటి ఆటగాడు వస్తాడేమో''అని పొలాక్ అన్నాడు. ఈ మాటలను బట్టి లక్ష్మణ్ విలువ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
క్లిష్టపరిస్థితుల్లో రాణించడం, కష్టాల్లో ఆదుకోవడం వీవీఎస్ లక్ష్మణ్‌కు కొత్తకాదు. మిగతా 10 మంది బ్యాట్స్‌మెన్ తడబడుతున్నప్పుడు అలవోకగా పరుగులు చేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఒకటి, రెండు కాదు..ఒంటి చేత్తో భారత్‌కు విజయాలందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు డర్బన్‌లో అదే సొగసైన ఆటతీరును ప్రదర్శించాడు. సఫారీ గడ్డపై 96 పరుగులతో భారత్‌కు మధురమైన విజయాన్నందించాడు. ఈ టెస్టులో రెండో అత్యుత్తమ స్కోరు కూడా లక్ష్మణ్ తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 38 పరుగులే కావడం విశేషం.
ఈ ఏడాది లక్ష్మణ్ మరో మూడు అద్భుతమైన రెండో ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆ మూడు కూడా మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేసిన సమయంలో వచ్చినవే. శ్రీలంకలో తొలిసారి భారత్ టెస్టు సిరీస్ ఓడిపోకుండా వచ్చిందంటే అది లక్ష్మణ్ చలువే. సారా ఓవల్‌లో జరిగిన మూడో టెస్టులో లక్ష్యఛేదనలో సెంచరీ (103) చేసి మరీ జట్టును గెలిపించాడు. ఈ విజయంతో సిరీస్ సమమైంది. ఆస్ట్రేలియాతో మొహాలీలో జరిగిన తొలి టెస్టులోనూ అంతే. రెండో ఇన్నింగ్స్‌లో పదో నెంబర్ బ్యాట్స్‌మెన్ ఇషాంత్‌శర్మతో కలిసి భారత్‌ను గెలిపించాడు. 73 విలువైన పరుగులు చేశాడు. తొమ్మిదో వికెట్‌కు ఇషాంత్‌తో కలిసి 81 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాడు. తర్వాత న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 15కే 5 వికెట్లు కోల్పోయిన దశలో టీమ్ ఇండియాను రక్షించాడు. ఆసక్తికర విషయమేంటంటే, ఈ దశాబ్దం ఆరంభం (2001)లో ఆస్ట్రేలియాపై లక్ష్మణ్ 281 పరుగులు చేసి క్రీడాభిమానులు ఎన్నటికీ మరువలేని విజయాన్ని అందించిన వెరీ వెరీ స్పెషల్. డర్బన్‌లో 96 పరుగులతో అంతే ఘనంగా దశాబ్దాన్ని ముగించాడు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications