జగన్ కు మొయిలీ ఊడిగం?

Veerappa Moily
అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ ఇంకా ఊడిగం చేస్తున్నారని పార్టీ సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. రాజ్యసభ సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రియ మిత్రుడు కెవిపి రామచందర్ రావు మాటలకు ఆయన తలొగ్గుతున్నారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మొయిలీ ప్రాపకం వల్లనే శాసనసభ్యురాలు కొండా సురేఖ వంటి జగన్ వర్గీయులు రెచ్చిపోతున్నారని, ముఖ్యమంత్రి రోశయ్యపైనే కాకుండా పార్టీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. మొయిలీ వారికి ఎనలేని దీమాను కల్పిస్తున్నారని ఆగ్రహం చెందుతున్నట్లు సమాచారం. మొయిలీ వ్యవహారంపై ఇటీవల ముఖ్యమంత్రి కె. రోశయ్యకు, పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావుకు మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం.

మొయిలీని తొలగిస్తే తప్ప పరిస్థితిలో మార్పు రాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, మొయిలీ వైయస్ జగన్ కు అండగా నిలబడుతున్నారనే విషయం పార్టీ అధ్యక్షురాలు సోనియాకు కూడా తెలుసునని, కానీ వెంటనే తొలగించడం వల్ల అనవసరమైన ప్రాధాన్యం కల్పించినట్లవుతుందని భావించి కొనసాగిస్తున్నారని అంటున్నారు. మొయిలీ మార్పు కూడా మామూలు వ్యవహారంలాగా జరిగిపోయే సమయం కోసం ఆమె చూస్తున్నారని అంటున్నారు.

కాగా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా కెవిపి రామచందర్ రావుకు, మొయిలీకి సహకరిస్తున్నట్లు కాంగ్రెసు సీనియర్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన డిఎస్ ముఖ్యమంత్రి రోశయ్యకు పూర్తిగా సహకరించడం లేదని అంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జాప్యం కావడానికి కూడా మొయిలీయే కారణమని చెబుతున్నారు. మొయిలీకి చెప్పి మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించాల్సిన పరిస్థితి ఉండడం వల్ల వైయస్ జగన్ వర్గానికి ప్రాధాన్యాన్ని తగ్గించడానికి వీలు కాదనే ఉద్దేశంతో ఉండి రోశయ్య మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించడం లేదని అంటున్నారు. మొత్తం మీద, మొయిలీ మొదటి నుంచీ వైయస్ జగన్ కు అనుకూలంగానే ఉంటూ వస్తున్నారనేది కాదనలేని నిజం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+