చిరుకు ఇంకా నాగబాబు దూరమే

చిరంజీవి, రామానాయుడు వంటి వారందరూ వేదిక మీద కూర్చున్న వెంటనే నాగబాబు వేదిక దిగిపోయి తన భార్య పక్కన కూర్చున్నారు. ఆరెంజ్ సినిమాకు నాగబాబు నిర్మాతగా ఉన్నప్పటికీ వేదిక దిగిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రామ్ చరణ్ తేజాను చరణ్ అని సంబోధించడం నాగబాబుకు అలవాటు. తన కన్నా చిన్నవాడిగా ఆయన అలా పిలిచేవారు. అయితే, కార్యక్రమంలో ప్రసంగించే సమయంలో ప్రత్యేకంగా చరణ్ బాబు అంటూ సంబోధించారు. చిరంజీవి ఎదుట రామ్ చరణ్ ను చొరవతో చరణ్ అని సంబోధించలేకపోయారని అంటున్నారు. దీన్ని బట్టి వారిద్దరి మధ్య దూరం తరగలేదని అర్థమవుతోందని అంటున్నారు.
కార్యక్రమం జరుగుతున్నంత సేపు చిరంజీవి తన బావమరిది అల్లు అరవింద్ తోనే గడిపారు. తన సోదరుడు నాగబాబు చిత్ర నిర్మాత కూడా అయినా చిరంజీవి పట్టించుకోలేదు. అల్లు అరవింద్ మాటలకే చిరంజీవి విలువ ఇస్తున్నారని, దాంతో నాగబాబుతో దూరం పెరిగిందని అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో కూడా అదే జరుగుతోందనే అభిప్రాయం ఉంది.












Click it and Unblock the Notifications