బీసీ ఓట్లపై తెలుగుదేశం అధినేత దృష్టి

బీసీ, ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం మళ్లీ పోరాట పంథాను ఎంచుకోనుంది. బడుగు వర్గాలకు, ప్రధానంగా బీసీలకు చేరు వయ్యేలా కార్యాచరణ ఖరారు చేయనుంది. తెలంగాణలో మెజారిటీ శాతం ఉన్న బీసీల ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో విఫలమవుతున్న వాస్తవాన్ని నాయకత్వం ఎట్టకేలకు గుర్తించినట్లుంది.
గౌడ, యాదవ, పద్మశాలి, మత్స్యకారుల ఓటు బ్యాంకును తిరిగి తెచ్చుకునేందుకు తెలుగుదేశం మేధావులు వ్యూహ రచన చేస్తున్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఈ నాలుగు బీసీ కులాలు కట్టగట్టుకుని తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు. వైఎస్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ ఓటు బ్యాంకులను ఆయన కొల్లగొట్టారు. ఇప్పుడు ఈ కులాల ఓట్లపై చంద్రబాబు దృష్టి కేంద్రీకరించారు.












Click it and Unblock the Notifications